
ఎన్నాళ్ళుగానో చెరగనే లేదు ఈ ప్రేమ భాషే
తేనెల్లు చిందే ఊహలతోటి గుండెల్ని ముంచే
ఓ లాలి పాటై వయసుకు పూల పందిళ్ళు వేసే
తొలితొలి ప్రేమ జన్మలెన్నైనా వీడిపోదు
కాలం కాదన్నా చెలిమితో హృదయాన్ని అల్లుకోదా
నింగే చెంత వాలి మనసున హరివిల్లు గీసి పోదా
ఇసుకలలో నది మలుపుల్లో చిరుగాలుల్లో గాలల్లే
ప్రతి ఎదలో ముడి పడు జతలో తొలి ప్రేమ సంతకమే
పగలైనా నడి రేయైనా తన ఊహే నా ఊహే నా
నవ్వులకు మరి వేదనకు చెబుతుంది స్వాగతమే
ఓ కోపంగా కొంచెం మౌనంగా నువ్వున్నా
పొంగే కన్నీరు ఆగేనా కాస్తైనా కునుకు తీసేనా
ఎన్నాళ్ళుగానో ...
చిరు కలహం ఇది ఒక విరహం ఏ సంతోషం సరి కాదే
ఈ ప్రణయం ఓ తొలి జననం విడిపోనిదీ వరమే
మెరుగులకు పై మెరుపులకు వశమయ్యేనా కొంతైనా
ఇరువురిలో ఓ ఊపిరిగా కొలువైన పసి గుణమే
లోకంలో వేచే ఏకాంత హృదయాలు జంటైన ప్రేమించు
దారుల్లో పూదోటై భూమి పూస్తుందే...
చిత్రం : నిన్ను చూస్తే లవ్ వస్తుంది (2012)
సంగీతం : హర్రిస్ జయరాజ్
రచన : వనమాలి
గానం : ఆలాప్ రాజు, దేవన్, రాణినా రెడ్డి
*************************************************
yennallugano cheragane ledu ee prema bhaashe
tenellu chinde uhalatoti gundelni munche
oo lali paatai vayasuku pula pandillu vese
tolitoli prema janmalennainaa veedipodu
kaalam kaadannaa chelimito hrudayanni allukodaa
ninge chenta vaali manasuna harivillu geesi podaa
isukalalo nadi malupulalo chirugaalullo galalle
prati yedalo mudi padu jatalo toli prema santakame
pagalainaa nadi reyainaa tana uhe na uhe naa
navvulaku mari vedanaku chebutundi swagatame
oo kopamgaa konchem mounamgaa nuvvunnaa
ponge kanneeru aagenaa kaastainaa kunuku teeseenaa
yennaallugano...
chiru kalaham idi oka viraham ye santosham sari kaade
ee pranayam oo toli jananam vidiponidee varame
merugulaku pai merupulaku vashamayyenaa kontainaa
iruvurilo oo upirigaa koluvaina pasi guname
lokamlo veche yekaanta hrudayaalu jantaina preminchu
daarullo pudotai bhumi pustunde...
Movie Name : Ninnu Chusthe Love Vasthundi (2012)
Music Director : Harris Jayaraj
Lyricist : Vanamali
Singers : Aalaap Raju, Devan, Ranina Reddy
No comments:
Post a Comment