Sunday, May 5, 2013

తొలితరం సంగీత దర్శకుడు గాలి పెంచల నరసింహా రావు

గాలి పెంచల నరసింహారావు (1903-1964) తెలుగు చలనచిత్ర సంగీతదర్శకులలో మొదటితరానికి చెం దినవారు. దక్షిణభారతదేశంలో నిర్మితమైన మొట్టమొదటి చిత్రం సీతాకళ్యాణం (1934) ఆయన సంగీతం అందించిన మొదటి చిత్రం అది ఆయన చివరి చిత్రం ఎన్‌.ఏ.టి. వారి సీతారామ కల్యాణం (1961), ఆ చిత్రం ఆయన సం గీతం అందించిన చిత్రాలలో అన్నింటికన్నా పెద్ద విజయం సాధించింది. ఈ చిత్రంలో ఆయన స్వరపరచిన ‘సీతారా ముల కళ్యాణం చూతము రారండి’ పాట ఎంతో ఘనవిజ యం సాధించిందో అందరికీ తెలుసు. ఆ పాట ఇప్పటికీ శ్రీ రామనవమి నాడే కాక, తొమ్మిది రోజులు జరిగే ఉత్సవాల్లో కూడా వినిపిస్తూ ఉంటుంది. అంతేకాదు... తెలుగుతనం తో తెలుగునాట ఏ ఇంట పెళ్ళి జరిగినా ఈ పాట తప్పని సరిగా వినిపిస్తూనే ఉంటుంది. కోట్లాది మందికి ఈ పాట రామనామం అంత ఇష్టం. ‘ఆయన సంగీతం అందించిన తొలి చివరి చిత్రాలు ఒకే నేపథ్యం ఉన్న కథతో తయారు కావడం కాకతాళీయం’ అంటున్నారు సంగీతాభిమాని ఆదిత్య.

         1936లో విడుదలైన మాయాబజార్‌ లేక శశిరేఖా పరిణయం చిత్రంలో ఆయన స్వరపరిచిన ‘వివాహభోజ నంబు’ పాటనే ఘంటసాల స్వరపరిచిన 1957లో విడు దలైన మాయాబజార్‌లోని పాటకు మూలం. 1943లో వచ్చిన ‘పంతులమ్మ’ చిత్రంలో కృష్ణవేణి అనే అమ్మాయికి పాడే అవకాశం ఇచ్చారు గాలిపెంచల. ఆమే జిక్కి. ఆమె అసలు పేరు జి.కృష్ణవేణి. ఈ చిత్రంలో ఆమె- ‘ఈ తీరున నిన్నెరిగి పలుకగ నాతరమా’ అనే పాటను స్వయంగా నటి స్తూ పాడారు. 1945లో వచ్చిన ‘మాయాలోకం’ చిత్రం ద్వారా అలనాటి ప్రముఖ సంగీతదర్శకుడు పెండ్యాల నాగే శ్వరరావుకు తన ఆర్కెస్ట్రాలో హార్మోనిస్టుగా అవకాశం ఇ చ్చారు. 1947లో వచ్చిన ‘పల్నాటియుద్ధం’ చిత్రానికి ఆయ నే సంగీతదర్శకుడు. ఈ చిత్రంలో తనకు సహాయకునిగా పనిచేసిన ఘంటసాలతో కొన్ని పాటలు పాడించారు. ఆ చిత్రంలోని పాటలకు ప్రాధాన్యత, విశేషం ఉన్నాయి. అం దులో అక్కినేని నాగేశ్వరరావు స్వయంగా పాటలు పాడా రు, అక్కినేని నాగేశ్వరరావు, ఘంటసాల కలిసి ఒక పాట పాడారు, ఘంటసాల, కన్నాంబ కలిసి ఒక యుగళగీతం (భక్తిగీతం) - ‘తెరతీయగరాదా దేవా’ ఆలపించారు.


అక్కి నేని నాగేశ్వరరావు, ఎస్‌. వరలక్ష్మి కలిసి ఒక యుగళగీతం పాడారు. 1948లో వచ్చిన ‘బాలరాజు’ చిత్రంలో ఈయన స్వరపరచిన పాటలు ఆ చిత్ర విజయానికి బాటవేశాయి. ఘంటసాల పాడిన ‘చెలియా కనరావా’, ఎస్‌.వరలక్ష్మి పాడి న ‘ఎవరినే నేనెవరినే’ మొదలైన పాటలు ఆ చిత్రవిజయా నికి దోహదపడ్డాయి. గాలిపెంచల ప్రోత్సాహంతో ఆ చిత్రం లో కొన్ని పాటలను ఘంటసాల కూడా స్వరపరిచారు. అలాగే సీతారామ కళ్యాణంలో గాలి పెంచల సంగీత దర్శకత్వంలో సముద్రాల రాసిన ‘కానరావా కైలాస నివాసా’ అనే పాటను ఘంటసాల పాడారు.నరసింహారావు గారు సంగీతం అందించిన చిత్రాలన్నీ సంగీతపరంగా మంచి విజయాలను సాధించాయి. మాలపిల్ల (1938) చిత్రంలో హీరోగా నటించిన గాలి వెంకటేశ్వరరావు ఈయన తమ్ముడు. ఆయన ఇంటిపేరును చాలామంది గాలి పెంచల అనుకుంటారు, కానీ ఆయన ఇంటిపేరు గాలి, అసలు పేరు పెంచల నరసింహారావు. కొన్ని చిత్రాలలో ఆయన పేరును జి. పెంచలయ్యగా, కొన్ని చిత్రాలలో గాలి పెంచల అనీ, కొన్ని చిత్రాలలో పూర్తి పేరును వేశారు. గాలి పెంచల 61 ఏళ్ళ వయస్సులో మే 25, 1964న కన్నుమూశారు.

గాలి పెంచల చిత్రాలు...
సంగీత దర్శకుడిగా గాలిపెంచల నరసింహారావుగారి మొ దటిచిత్రం సీతాకళ్యాణం (1934). ఆ తర్వాత వరసగా శ్రీ కృష్ణలీలలు(1935), మాయాబజార్‌ (1936), మైరావణ (1940), గరుడ గర్వభంగం (1943), కృష్ణప్రేమ (1943), పంతులమ్మ (1943), మాయలోకం (1945), పల్నాటి యుద్ధం (1947), బాలరాజు (1948), ధర్మాంగద (1949), అగ్నిపరీక్ష (1951), సీతారామ కల్యాణం (1961) సినిమాల కు సంగీతాన్ని అందించారు. సీతారామ కళ్యాణం చివరి చిత్రం. ఆయన మొదటి చిత్రమూ సీతా కళ్యాణం అయితే, చివరి చిత్రమూ సీతారామ కళ్యాణమే కావడం విశేషం.‚

అలనాటి విశిష్ట సంగీత దర్శకుడు...అద్దేపల్లి రామారావు
అలనాటి ప్రముఖ సంగీతదర్శకుల్లో ఒకరు అద్దేపల్లి రామారావు. ఈయన ఓగిరాల రామచందర్రావు, సాలూరి రాజేశ్వరరావు వద్ద కొన్ని చిత్రాలకు ఆర్కెస్ట్రా నిర్వాహకునిగా పనిచేశారు. ఎక్కువగా వాహినీవారి చిత్రాలకు. అలనాటి ప్రముఖ సంగీతదర్శకుడు ఎస్‌.పి.కోదండపాణి రామారావు సంగీతం అందించిన నా యిల్లు (1953) చిత్రంతో బృందగాయకునిగా చిత్రసీమ కు పరిచయమయ్యారు.అద్దేపల్లి రామారావు సంగీతదర్శకునిగా సువర్ణమాల (1948), అదృష్టదీపుడు (1950), నా ఇల్లు (1953), బంగారు పాప (1954), చింతామణి (1956) పనిచేశా రు. అలాగే ఆర్కెస్ట్రా నిర్వాహకునిగా గుణసుందరి కథ (1949), పేరంటాలు (1951), మల్లీశ్వరి (1951) సిని మాలకు చేశారు. ఓగిరాల సంగీతాన్ని అందించిన పెద్ద మనుషులు (1954) చిత్రానికి అద్దేపల్లి రామారావు పని చేశారు. ఈ చిత్రంలో కొసరాజు రాయగా, ఘంటసాల పాడిన ‘శివశివ మూర్తివి గణనాథా నువ్వు శివుని కుమా రుడవు గణనాథా’ అనే పాట చాలా ఫేమస్‌ అయింది.
- వి.మధుసూదనరావు

No comments:

Post a Comment