Tuesday, August 27, 2013

మూగైన హృదయమా నీ గోడు తెలుపుమా ......... ఆత్మబంధువు (1985)

పల్లవి :
మూగైన హృదయమా నీ గోడు తెలుపుమా
ఓదార్చి తల్లివలే లాలించే
ఎడదను ఏమనీ అడుగుమా
మూగైన హృదయమా నీ గోడు తెలుపుమా
కాచావు భారము అయినావు మౌనము
రాకాసి మేఘము మూసేస్తే చీకటులు ముంచేస్తే
అణగడు సూర్యుడు ఆరడు

చరణం : 1
మనసన్నది మాసిపోనిది
సొత్తు ఉన్నది సుఖమే లేనిది
ఏ వేదనా ఎన్నినాళ్లదీ ఓదార్చినా ఒడ్డు లేనిది
నా పాటకే గొంతు పలికింది లేదు
నా కళ్లకీనాడు కన్నీళ్లు రావు
తడిలేని నేలైనావు తొలకరులు కురిసే తీరు
ఎవ్వరూ అన్నది... నిన్నెరిగిన మనిషి అన్నది
॥

చరణం : 2
మనసేడ్చినా పెదవి నవ్వెను
పైపైది ఈ పగటి వేషము
నీ గుండెలో కోవెలున్నది
ఏ దేవతో వేచియున్నది
ఇన్నాళ్లు మూసిన ఈ పాడు గుడిని
ఏ దేవ తిక వచ్చి తెరిచేదనీ
ఈ కోకిలుంటే చాలు జరిగేను ఏదైనాను
ఎవ్వరీ కోయిల... చిగురాశల చిట్టి కోయిల
అరె నీవా కోయిల ఏ కొమ్మ కోయిల
విన్నానే కనులెదుట కన్నానే
పొంగులై హృదయము పొర లెనే
నేనే ఆ కోయిల ఉన్నా నీ లోపల
విన్నాను కనులెదుట కన్నాను
మారునా... నీ వెత తీరునా...


చిత్రం : ఆత్మబంధువు (1985)
సంగీతం : ఇళయరాజా
రచన : ఆచార్య ఆత్రేయ
గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి

No comments:

Post a Comment