Saturday, August 10, 2013

వాత్సాయనా అనుభవసారాలు వివరించనా .... శ్రీనివాస కళ్యాణం (1987)














వాత్సాయనా  అనుభవసారాలు వివరించనా
సమ్మోహనా రతినై అందాలు అందించనా
చింతామణీ అమృతాల అధరాలు  అందించవే
సమ్మోహిణీ సరసరసవీణ శృతి చేయవే
వాత్సాయనా....ఓ చింతామణీ

నానేటి చేసేదిరో దేవరా నిన్నెట్ట కలిసేదిరో
నానేటి చేసేదిరో దేవరా నిన్నెట్ట కలిసేదిరో
రేతిరికి కూసింత కునుకైన రాదాయే సలిలోన ఒళ్ళంతా పొయ్యల్లే అయిపోయే
రేతిరికి కూసింత కునుకైన రాదాయే సలిలోన ఒళ్ళంతా పొయ్యల్లే అయిపోయే
నానేటి చేసేదిరో దేవరా నిన్నెట్ట కలిసేదిరో

తొలిజామునొస్తంటే తులిసెమ్మ పిలిచిందే మలిజామునొస్తంటే మాణిక్యం కలిసిందే
తొలిజామునొస్తంటే తులిసెమ్మ పిలిచిందే మలిజామునొస్తంటే మాణిక్యం కలిసిందే
ఆడనుంచి వస్తుంటే దీని సిగతరగా తెల్లరిపోయిందే
నానేటీ చేసేది సుందరీ నిన్నెట్ట కలిసేదే

హొయ్యారే హొయ్యారే హొయ్య హొయ్య చేతిలొ చెయ్యెయ్యరా అయ్యా
హొయ్యారే హొయ్యారే హొయ్య హొయ్య చేతిలొ చెయ్యెయ్యరా అయ్యా
నా అందాలసందాలు నువ్వు మొయ్యా నీ పొగరంత సందేల పక్కవెయ్య
నీ సిరినవ్వు సిగలోన పువ్వులవ్వ
నే సిలకల్లె కులుకుత ముద్దులివ్వ

జంబారే జంబారే జంబ జంబా కొండల్లో కోనల్లో రాయే రంభ
జంబారే జంబారే జంబ జంబా కొండల్లో కోనల్లో రాయే రంభ
మోగిందె కోయోళ్ళ పెళ్ళి పంబ కూసిందే కోయోళ్ళ పడుసు తంబ
మనసాయె నీ మీద కోనలమ్మ నీతో ఉంటానే వెన్నెలమ్మ
హొయ్యారే హొయ్యారే హొయ్య హొయ్య...
జంబారే జంబారే జంబ జంబా  ||వాత్సాయనా||


చిత్రం : శ్రీనివాస కళ్యాణం (1987)
సంగీతం : కె.వి.మహదేవన్ 
రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : యస్.పి.బాలు , పి.సుశీల 
***************************************************
Movie Name :  Srinivasa Kalyanam  (1987)
Music Director : K.V.Mahadevan
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singers : S.P.Balu, P.Susheela

No comments:

Post a Comment