Saturday, August 10, 2013

తుమ్మెద ఓ తుమ్మెదా ఎంత తుంటరోడె గోవిందుడు తుమ్మెదా ..... శ్రీనివాస కళ్యాణం (1987)

తుమ్మెద ఓ తుమ్మెదా ఎంత తుంటరోడె గోవిందుడు తుమ్మెదా 

మగడు లేని వేళ తుమ్మెదా ఒచ్చి మొహమాట పెడతాడె తుమ్మెదా 
మాట వరసకంటా తుమ్మెదా పచ్చి మోటా సరసమాడె తుమ్మెదా 
అత్త ఎదురుగానె తుమ్మెదా రెచ్చి హత్తుకోబోయాడె తుమ్మెదా 
తుమ్మెదా ఓ తుమ్మెదా ఎంత తుంటరోడె గోవిందుడు తుమ్మెదా 

ఎదురుపడితె కదలనీక దడి కడతాడే 
పొద చాటుకి పదపదమని సొద పెడతాడే 
ఎదురుపడితె కదలనీక దడి కడతాడే 
పొద చాటుకి పదపదమని సొద పెడతాడే 
ఒప్పనంటె వదలడమ్మా ముప్పు తప్పదంటె బెదరడమ్మా 

చుట్టుపక్కలేమాత్రం చూడని ఆత్రం 
పట్టువిడుపు లేనిదమ్మ కృష్ణుని పంతం
మగడు లేని వేళ తుమ్మెదా ఒచ్చి మొహమాట పెడతాడె తుమ్మెదా 
మాట వరసకంటా తుమ్మెదా పచ్చి మోటా సరసమాడె తుమ్మెదా 
అత్త ఎదురుగానె తుమ్మెదా రెచ్చి హత్తుకోబోయాడె తుమ్మెదా 
తుమ్మెదా ఓ తుమ్మెదా ఎంత తుంటరోడె గోవిందుడు తుమ్మెదా 
తుమ్మెదా  తుమ్మెదా  తుమ్మెదా 

స్నానమాడు వేళ తాను దిగబడుతాడే 
తాను మాటు చేసి చూడ ఎగబడుతాడే 
స్నానమాడు వేళ తాను దిగబడుతాడే 
తాను మాటు చేసి చూడ ఎగబడుతాడే 
చెప్పుకుంటే సిగ్గు చేటు అబ్బ నిప్పు లాంటి చూపు కాటూ

ఆదమరిచి ఉన్నామా మా కోకలు మాయం 
ఆనక ఏమనుకున్నా రాదే సాయం

మగడు లేని వేళ తుమ్మెదా ఒచ్చి మొహమాట పెడతాడె తుమ్మెదా 
మాట వరసకంటా తుమ్మెదా పచ్చి మోటా సరసమాడె తుమ్మెదా 
అత్త ఎదురుగానె తుమ్మెదా రెచ్చి హత్తుకోబోయాడె తుమ్మెదా 
తుమ్మెదా ఓ తుమ్మెదా ఎంత తుంటరోడె గోవిందుడు తుమ్మెదా 
తుమ్మెదా ఓ తుమ్మెదా ఎంత తుంటరోడె గోవిందుడు తుమ్మెదా 

చిత్రం : శ్రీనివాస కళ్యాణం (1987)
సంగీతం : కె.వి.మహదేవన్ 
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి 
గానం : యస్.పి.బాలు , పి.సుశీల
********************************************
Movie Name :  Srinivasa Kalyanam  (1987)
Music Director : K.V.Mahadevan
Lyricist : Sirivennela Seetharama Sastry
Singers : S.P.Balu, P.Susheela

No comments:

Post a Comment