Monday, August 5, 2013

ఎందుకు ఈ చట్టం ఎవరికి ఈ న్యాయం ..... అమ్మ నాన్న కావాలి (1996)

ఎందుకు ఈ చట్టం ఎవరికి ఈ న్యాయం
ఏమిటి మా నేరం ఏది సమాధానం
ఎందుకు ఈ చట్టం ఎవరికి ఈ న్యాయం
ఏమిటి మా నేరం ఏది సమాధానం
భావి దేశ పౌరులం అడుగుతున్న ప్రశ్న ఇది
భరతజాతి చరిత్రకే మాసిపోని మచ్చ ఇది
  ||ఎందుకు ఈ చట్టం||

పంతాలకు పట్టుదలకు తల్లితండ్రి విడిపోతే
తల్లడిల్లిపోయే పిల్లల గతి ఏమిటి
పతియే సతి దైవమని నాతిచరామి అని
శాస్త్రానికి మంత్రానికి అర్థం ఇక ఏమిటి
అభం శుభం తెలియని పసివారిని విడదీసి
అమ్మవెంట నాన్నవెంట పంపకండి దయచేసి
అనుబంధాలన్ని ఉండి ఏ ప్రేమకు నోచుకోని అభాగ్యులను
అనాథలను చేయకండి ఇకనుండి
రాజీపడకుండానే బ్రతుకుతున్నది ఎవరు
విడిపోయిన జీవితాన సుఖపడింది ఎవరు
న్యాయమూర్తులారా రాజ్యాంగవేతాలారా
తీర్పు ఇవ్వడం కాదు ఆలోచించండి
ఈ విడాకు చట్టాన్ని సవరించండి
ఈ విడాకు చట్టాన్ని సవరించండి         ||ఎందుకు ఈ చట్టం||

పెద్దల కలహాల కొరకు పిల్లల నూరేళ్ళ బ్రతుకు
బలి చేసే మీకు ఈ పదవి దేనికి
ప్రేమా ఆప్యాయత చూపించే బాధ్యత తెంచుకుని
ఒకరినొకరు సాధించేదేమిటి
అమ్మ వదిలి అందరికి అలుసై అల్లాడిపోయి
నాన్న వదిలి బ్రతుకంతా నరకంగా మారిపోయి
నడివీథిన మా బ్రతుకులు నవ్వులపాలైతుంటే
మీ తప్పుకు మేమిప్పుడు తలలు వంచుకుంటుంటే
మీది మమత మాకు ఇంక ఎవరు పంచగలరు
సెగలు రగిలే మా గుండెలు చల్లార్చేదెవరు
న్యాయమూర్తులారా రాజ్యాంగవేతాలారా
తీర్పు ఇవ్వడం కాదు ఆలోచించండి
ఈ విడాకు చట్టాన్ని సవరించండి


చిత్రం :  అమ్మ నాన్న కావాలి (1996)
సంగీతం :  వందేమాతరం శ్రీనివాస్
రచన :  జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : K.S. చిత్ర
*********************************************
Movie Name : Amma Nanna Kavali (1996)
Music Director : Vandemataram Srinivas
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singer : K.S.Chitra

No comments:

Post a Comment