Monday, August 5, 2013

పెళ్ళి చేసుకోరా చక్కని పిల్లని చూస్తారా .... అమ్మ నాన్న కావాలి (1996)

పెళ్ళి చేసుకోరా చక్కని పిల్లని చూస్తారా
నోరు మూసుకోరా పెళ్ళను మాటే ఎత్తకురా
బ్రహ్మచారిగా సెటిలైపోతే కోడె మగతనం వేస్టు కదా
సంసారం లో పడ్డామంటే
బ్రతుకే రోజు రొస్టురా చెప్పడానికే వరస్టు రా          
||పెళ్ళి చేసుకోరా||

బంగరు కడ్డీలాంటి వయసులో పెళ్ళికి నీకు భయమెందుకురా
బడ్జెట్టు మనకు ఎడ్జెస్టు కాదు బిగ్గెస్టు పాబ్లమవుతుంది
మూడుముళ్ళతొ మోడు జీవితం పూలబాటగా అవుతుంది
అమ్మాయి కాలు పెట్టినవేళ అంతా కలిసివస్తుంది
బోడి జాబుతో జోడీ కడితే మాడు పగులుతుంది
పెరిగే ధరలతో పెళ్ళయ్యిందా బ్రతుకే వీధిన పడుతుంది
ప్రతి పండుగకు అత్తమామలను ప్యాంటూ షర్టు అడగొచ్చు
బ్యాచిలరైతే పేచీ ఉండదు గోచీ పెట్టుకు తిరగొచ్చు
సంసారం లో స్వర్గం ఉంది
ఆ స్వర్గం లో నరకం ఉంది
పెళ్ళయిన జీవితం నందనం అందుకు నాందీ శోభనం
మూడు రోజులే శోభనం దినం దినం ఇక తద్దినం         ||పెళ్ళి చేసుకోరా||

ఏజ్ దాటితే ఏ అమ్మాజీ మ్యారేజీకి ఒప్పుకోదురా
రాత్రి వేళ నీ అవస్త చూస్తే నాకే జాలేస్తున్నదిరా
బొట్టుబిళ్ళ కొనడానికి ఐనా పావలా బిళ్ళ లేనోన్ని
తాళి కట్టి చెలి చేయిపట్టి నేనేట్టా పోషించేదిరా
మంచి పెళ్ళాన్ని మించిన యోగం మగాడి బతుకున ఏముంది
బోడి సలహాలు చెప్పకురా మ్యారేజి ట్రాజెడి తప్పదురా
వంట బాధలే తప్పునురా ఒంటి బాధలే తీరునురా
కొత్త బాధ్యతలు పెరుగునురా నెత్తికి వత్తిడి మొదలవురా
ప్రేమకు పెళ్ళాం గొళ్ళెం రా


చిత్రం :  అమ్మ నాన్న కావాలి (1996)
సంగీతం :  వందేమాతరం శ్రీనివాస్
రచన :  జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : మనో
*********************************************
Movie Name : Amma Nanna Kavali (1996)
Music Director : Vandemataram Srinivas
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singer : Mano

No comments:

Post a Comment