Tuesday, October 29, 2013

ఇది సరిగమలెరుగని రాగం ఇది భాషేలేని భావము ..... హై హై నాయకా (1989)

ఇది సరిగమలెరుగని రాగం
ఇది భాషేలేని భావము
ప్రేమగానమో.....

ఇది ఇది అని తెలియని భారము
ఇది పలికే భాషే మౌనము
ప్రేమగానమో.....                  
 ||ఇది సరిగమలెరుగని రాగం||

మణిలాగ రమణిలాగ
సుధచిందె వసుధమందె
అరవిరిసే ఆశల ఆమని

నువు రాగా తనువు ఊగా
లతలోని కలతతీరా
జతచేరా రారా జాబిలి
కల హంసలా......విరిధనువులా రావే వధువులా      ||ఇది ఇది||

గిలిగింత రగిలినంత రసగీతి సరసగీతి
రవళించగా రా రా మురళిలా

వనరాణీ కవనవాణీ కలవాలి కలలకేళీ
తెలివెన్నెల విరిసే వేళలో
నిను చేరగా....సరి సమయమే రాని శుభమని        
 ||ఇది సరిగమలెరుగని రాగం||


చిత్రం :  హై హై నాయకా (1989)
సంగీతం :  సురేష్ చంద్ర
రచన :  జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, ఎస్. జానకి
*********************************************
Movie Name :  Hai Hai Nayaka (1989)
Music Director : Suresh Chandra
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singer : S.P.Balasubramanyam, S.Janaki

No comments:

Post a Comment