Tuesday, October 29, 2013

అందరు చేసే వ్రతమయ్యా సత్యన్నారాయణ వ్రతం ..... మా ఇలవేల్పు (2004)

అందరు చేసే వ్రతమయ్యా సత్యన్నారాయణ వ్రతం
శ్రీ సత్యన్నారాయణ వ్రతం
అందరు చేసే వ్రతమయ్యా సత్యన్నారాయణ వ్రతం
శ్రీ సత్యన్నారాయణ వ్రతం
పేదా గొప్పా కుల బేధం లేనే లేనిది ఈ వ్రతం
శ్రీ సత్యన్నారాయణ వ్రతం
ఇల్లు కట్టినా పెళ్ళి చేసినా....
ఇల్లు కట్టినా పెళ్ళి చేసినా ఏ శుభకార్యం జరిగినా
అందరు చేసే వ్రతమయ్యా సత్యన్నారాయణ వ్రతం
శ్రీ సత్యన్నారాయణ వ్రతం

గణపతి బ్రహ్మ విష్ణుగుప్తులు గౌరిని వ్రతమునకు ఆహ్వానించి
గౌరిని వ్రతమునకు ఆహ్వానించి
దిక్పాలకులు నవగ్రహాలకు పేరుపేరున స్వాగతమిచ్చి
పేరుపేరున స్వాగతమిచ్చి
కలశస్థాపన చేసి భక్తితో నిష్ఠగ ప్రాణప్రతిష్ఠను చేసి
నిష్ఠగ ప్రాణప్రతిష్ఠను చేసి
ప్రవాసహిత సత్యనారాయణుని రారమ్మని ఆవాహన చేసి
రారమ్మని ఆవాహన చేసి
అర్ఘ్యపాదములతో వస్త్ర గంధములతో..
చిత్తశుద్ధితో అంగపూజను అష్టోత్తర శతనామ పూజను
ధూపదీపములు నైవేద్యములు చేసిన ఇంట కనకవర్షము                          ||అందరు చేసే||

స్వామి మహాత్మ్యము జగతికి చాటే ఐదు వ్రతకథలు శ్రద్ధగా విని
ఐదు వ్రతకథలు శ్రద్ధగా విని
శిరసా మనసా వందనములనిడి అక్షింతములు తమ శిరమున దాల్చి
అక్షింతములు తమ శిరమున దాల్చి
నిష్ఠగా వ్రతమును చేసినవారు నిర్మలభక్తితో చూసినవారు
నిర్మలభక్తితో చూసినవారు
స్వీకరించగా తీర్థప్రసాదములు స్థిరముగ కలుగును స్వామి అనుగ్రహం
స్థిరముగ కలుగును స్వామి అనుగ్రహం
శాంతిసౌఖ్యములతో....భోగభాగ్యములతో....
ముడుపులు చెల్లును నారాయణుడు
రత్నాచలమున రమానాథుడు
అన్నవరములో ఉన్న దేవుడు అన్ని వరమౌలను ఒసగే నాథుడు                       ||అందరు చేసే||

ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణస్వామి కరుణా కటాక్ష సిద్ధిరస్తు!
తథాస్తు!!
ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు!
తథాస్తు!!


చిత్రం :  మా ఇలవేల్పు (2004)
సంగీతం :  వందేమాతరం శ్రీనివాస్
రచన :  జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : వందేమాతరం శ్రీనివాస్, ఉష
*********************************************
Movie Name : Maa Ilavelpu (2004)
Music Director : Vandemataram Srinivas
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singers : Vandemataram Srinivas, Usha

No comments:

Post a Comment