Tuesday, October 29, 2013

ఓ నాగదేవి కరుణించవే పొరాపాటులన్ని మన్నించవే ..... మా ఇలవేల్పు (2004)

ఓ నాగదేవి కరుణించవే
పొరాపాటులన్ని మన్నించవే
ఓ నాగదేవి కరుణించవే
పొరాపాటులన్ని మన్నించవే
ఇలవేలుపై ఇల్లు చేరవే
కులదేవతై కొలువుండవే
గైకొనవే మా పూజలే                   ||ఓ నాగదేవి||

ఓంకార రూపము శ్రీ చక్రయంత్రము ఓ దేవీ నీ నడకలే
శ్రీ విష్ణుపాదము శివదేవ శూలము నీ పడగపై మొలుచులే
నీ పుట్టకు మొక్కితి అమ్మా మా పుట్టుక సఫలము సుమా
నీ పుట్టమట్టిలో మహిమా జై కొట్టి చాటునే బ్రహ్మ
ఏడేడు లోకాలకే...                      ||ఓ నాగదేవి||

లోకాలదారులు ముక్కోటి నదులు నిన్ననుకరించేనులే
నీ బుసల ఊసులు ఆ వేదఘోషలు నూరేళ్ళ ఆశీస్సులే
నమ్మితిమే నాగమ్మ మమ్ము చల్లగ కాపాడమ్మా
మా తప్పుల మన్నించమ్మా ఇక తరలి వేగమే రమ్మా
నీరాజనమే నీకిది                    ||ఓ నాగదేవి||


చిత్రం :  మా ఇలవేల్పు (2004)
సంగీతం :  వందేమాతరం శ్రీనివాస్
రచన :  జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : ఉష
*********************************************
Movie Name : Maa Ilavelpu (2004)
Music Director : Vandemataram Srinivas
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singer : Usha

No comments:

Post a Comment