Showing posts with label సినీ లోకం (Tollywood Cine World). Show all posts
Showing posts with label సినీ లోకం (Tollywood Cine World). Show all posts

Friday, May 9, 2014

దర్శకుడు - లక్ష్మీదీపక్

LaxmiDeepak
తెలుగు సినిమా చరిత్రలో ఉత్తమ కుటుంబ కథా చిత్రాల ప్రస్తావన వచ్చినప్పుడల్లా తప్పకుండా గుర్తుకు వచ్చే దర్శకుడు మన లక్ష్మీదీపక్. జూన్ 10న ఆయన 11వ వర్థంతి.
1935లో హైదరాబాద్‌లో పుట్టిన లక్ష్మీదీపక్ అసలు పేరు లక్ష్మీనారాయణ. హైస్కూలులో చదువుకునే రోజుల్లోనే సినిమాలు తీయాలని, దర్శకత్వం వహించాలన్న కోరిక పెంచుకున్నాడు. అయితే, సినిమాలు తీయడానికి, డైరెక్ట్ చేయడానికి ఏం చేయాలో మాత్రం అతనికి తెలియదు. కానీ, విపరీతంగా సినిమాలు చూడటమేగాక, నాటకాల వారితో కలిసి తిరిగేవాడు, వాటిల్లో వేషాలు కూడా వేసేవాడు.
హైదరాబాదీ కావడంతో ఆయన చదువంతా ఉర్దూ మీడియంలోనే సాగింది. దీంతో హిందీ సినిమాల్లోనే తన అదృష్టం పరీక్షించుకోవాలనుకున్నాడు. అప్పట్లో హిందీలో అగ్రక్షిశేణి సంగీత దర్శకులైన శంకర్ - జై కిషన్ ద్వయంలో హైదరాబాదీ అయిన శంకర్‌ను బాగా ఎరిగిన ఒకాయన సిఫారసు ఉత్తరం ఇచ్చాడు. దాంతో బొంబాయి రైలెక్కాడు మన లక్ష్మీనారాయణ. తీరా వెళ్లాక శంకర్‌ని కలిసినప్పటికీ పూర్వానుభవం లేకపోవడంతో ఎవరూ ఆయనకు అవకాశం ఇవ్వలేదు. అలా బొంబాయిలో తన ప్రయత్నాలేవీ ఫలించక పోవడంతో మళ్లీ హైదరాబాద్‌కు తిరుగు పయనం కట్టాడు లక్ష్మీనారాయణ. ఇది జరిగింది 1958 ప్రాంతంలో.

హైదరాబాద్ రాగానే ఆయనకు అట్లూరి పూర్ణచందర్ రావుతో పరిచయం ఏర్పడింది. ఆయన ద్వారా ప్రత్యగాత్మ, ఈయన ద్వారా జి. రామినీడు పరిచయం అయ్యారు. దాంతో లక్ష్మీ నారాయణ సినీ రంగవూపవేశానికి ద్వారాలు తెరచుకున్నాయి.

రామినీడు హైదరాబాద్‌లో తొలిసారిగా చిత్రీకరణ జరుపుకున్న ‘మా ఇంటి మహాలక్ష్మి’ (1959) చిత్రానికి దర్శకత్వం వహిస్తూ సినిమా షూటింగ్ జరిగే విధానాన్ని పరిశీలించమని లక్ష్మీనారాయణకు చెప్పాడు. సినిమాల పట్ల ఆయనలో ఉన్న శ్రద్ధాసక్తులను గమనించిన రామినీడు తాను ఆ తరువాత దర్శకత్వం వహించిన ‘చివరకు మిగిలేది’ (1960) సినిమాకు అసిస్టెంట్‌గా పనిచేయడానికి మద్రాసుకు రమ్మన్నారు.

ఈ చిత్రంలోనే తొలిసారిగా నటించిన డా॥ ప్రభాకర్‌డ్డితో ఏర్పడిన పరిచయం మన వాడి సినీ జీవితాన్ని మలుపు తిప్పింది. ఇద్దరూ తెలంగాణకు చెందిన వారవడంతో మద్రాసులో ఒక గదిలో ఉండేవారు. తరువాత లక్ష్మీనారాయణ రామినీడు వద్దనే ‘కలిమిలేములు’ (1962) హేమాంబరధరరావు వద్ద ‘కలవారి కోడలు’, ‘దేవత’, ‘పొట్టి ప్లీడరు’, ‘వీలునామా’, ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న కథ’, ‘ఆడపడుచు’, ‘కథానాయకుడు’ వంటి చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి, డైరెక్షన్‌లోని మెళకువలు ఆకళింపు చేసుకున్నాడు.

మెల్లిగా డైరెక్షన్ ఛాన్సులకోసం ప్రయత్నిస్తుండగా మన ప్రభాకర్‌డ్డి ‘బయటి చిత్రాలకు వద్దు. మనమే సొంత బ్యానర్ పెడుతున్నాం. డైరెక్షన్ అవకాశం నేనే ఇస్తాను’ అని మాట ఇచ్చాడు. ఆ తరువాత ఆయన తన మాటను నిలబెట్టుకున్నాడు కూడా. బి.ఎన్.మూవీస్ బ్యానర్‌పై తొలుత కృష్ణ - వాణిశ్రీలతో ‘పచ్చని సంసారం’ (1970) సినిమా తీస్తూ ఆయన్ని దర్శకుడ్ని చేశాడు. అలా లక్ష్మీనారాయణ పేరును కాస్తా లక్ష్మీదీపక్‌గా మార్చేశాడు ప్రభాకర్‌డ్డి.

మొదటి సినిమా ‘పచ్చని సంసారం’ ఆర్థికంగా విజయం సాధించడమేగాక లక్ష్మీదీపక్‌కి దర్శకుడిగా మంచి పేరు వచ్చింది. ఆ వెంటనే ‘కూతురు కోడలు’, ‘జగత్ జంత్రీలు’ (1971) సినిమాలకు దర్శకత్వం వహించారాయన.
krisnaలక్ష్మీదీపక్‌ను దర్శకుడిగా అగ్రభాగాన నిలబెట్టిన చిత్రం ‘పండంటి కాపురం’ (1972). ఎస్.వి. రంగారావు, గుమ్మడి, కృష్ణ, ప్రభాకర్‌డ్డి, జమున వంటి అగ్రతారలతో అత్యధిక బడ్జెట్‌తో తీసిన ఈ చిత్రం సాధించిన ఘన విజయం లక్ష్మీదీపక్ స్థాయిని ఎంతో ఎత్తుకు పెంచింది. ఇదే చిత్రాన్ని హిందీలో ఆదుర్తి సుబ్బారావు ‘సునెహరా సంసార్’ పేరుతో నిర్మించగా, తమిళంలో లక్ష్మీదీపక్ దర్శకత్వంలోనే ‘అన్బు సహోదర్ గళ్’ పేరుతో తయారైంది. ‘పండంటి కాపురం’ సినిమా ఆయేటి జాతీయ అవార్డులలో ‘ఉత్తమ ప్రాంతీయ చిత్రం’గా అవార్డు అందుకోవడం లక్ష్మీదీపక్ ప్రతిభకు నిదర్శనం.

ఆ తరువాత లక్ష్మీదీపక్ సినిమాల విజయ పరంపర మొదలైంది. ప్రధానంగా డా॥ ప్రభాకర్‌డ్డితో కలిసి ఆయన రూపొందించిన చిత్రాలు తెలుగు సినిమా రంగంలో ఒక ట్రెండ్‌ని సృష్టించాయి. వీరిరువురి సినిమా జీవితం ఒకేసారి ప్రారంభమైంది. మద్రాసులో ఈయన ఒక సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా, ప్రభాకర్ రెడ్డి ప్రొడ్యూసర్‌గా పేరు పొందారంటే అతిశయోక్తికాదు. ప్రభాకర్‌డ్డి కనిపించిన చోట లక్ష్మీదీపక్‌ను ప్రత్యేకంగా వెదుక్కోనవసరం లేకుండేది. ప్రభాకర్‌డ్డి కథకు దీపక్ కథనం తోడైతే ఒక మంచి చిత్రం రూపొందుతుందనేది సినీ వర్గాల్లో అప్పట్లో ప్రచారంలో ఉన్న విషయం.

ప్రధానంగా లక్ష్మీదీపక్ ఆలోచనలో ఆవేశం నిండి ఉండేది. కథా చర్చల్లో తన వాదనకు అందరి ఆమోదం పొందే వరకు కొనసాగించే నైజం ఆయనది. కథను తెరపై నడపడంలో ఆయనకు మించిన టెక్నీషియన్ లేడు. ప్రభాకర్‌డ్డి తీసిన 27 సినిమాలలో ఎక్కువ చిత్రాలకు దర్శకత్వం వహించింది మన లక్ష్మీదీపకే.
పండంటి కాపురం తరువాత సామాజిక సమస్యలను ఇతివృత్తంగా చేసుకుని ‘గాంధీ పుట్టిన దేశం’ (1973), ‘నాకు స్వాతంత్య్రం వచ్చింది’ (1975) చిత్రాలు తీసిన లక్ష్మీదీపక్ 1979లో ‘కార్తీకదీపం’ చిత్రంతో మరో ఘన విజయం సాధించారు. ఇందులో శ్రీదేవి, శారద, శోభన్‌బాబు ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రంతోనే శోభన్‌బాబు ఇద్దరు హీరోయిన్లతో నటించే ట్రెండ్ మొదలైందనవచ్చు. లక్ష్మీదీపక్ కేవలం నాలుగు పాత్రలతోనే ఈ సినిమాను నడపడం ఆయన గొప్ప ప్రతిభకు నిదర్శనం. వైవిధ్య భరితమైన కథలు ఎంపిక చేసుకోవడమే ఆయన సినిమాల విజయానికి తొలి కారణం.

ఇదే విషయాన్ని ఆయన ఒక సందర్భంలో ప్రస్తావిస్తూ, ‘‘నేను సినిమా నిర్మాణంలో ఏ విషయంలోనూ రాజీ పడకూడదనుకుంటాను. అసలు నిర్మాత ఒక దర్శకుడిని ఎన్నుకున్న తరువాతనే కథ, మిగతా విషయాలపై నిర్ణయాలు జరగాలి. అలా ఆ దర్శకుడి నేతృత్వంలో వాటి ఎంపిక జరిగితేనే ఆ చిత్రం నిర్దిష్టంగా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంటుంది’’ అని అన్నారాయన. అయితే, ఆ తరువాత ‘మహా పురుషుడు’ (1981) సినిమాకు కథ, స్క్రిప్టు సిద్ధమయ్యాక దర్శకుడిగా ఎంపికై సినిమా తీశాక అది బాక్సాఫీసు వద్ద ఫెయిలయ్యింది. అపుడు ‘‘స్క్రిప్టు మార్చకుండా రాజీపడి సినిమా తీయడం తప్పేనని’’ చెప్పుకున్నారాయన.

అలాగే, దర్శకుడు నిర్మాణ రంగంలో, డైరెక్షన్‌లో రెండింటిలో వేలు పెట్టడం సరికాదని, అలా చేయడం వల్ల ఏకాక్షిగత లోపిస్తుందని కూడా అన్నారాయన. అలా అటు నిర్మాతగా, ఇటు దర్శకునిగా ఆయన తీసిన సినిమానే ‘ధైర్యవంతుడు’ (1986) ఇది విజయవంతం కాలేదు.

ఈ నేపథ్యంలో లక్ష్మీదీపక్ ‘గూడు పుఠాణి’ (1972), ‘హారతి’, ‘ఇంటికోడలు’ (1974), ‘వయసొచ్చిన పిల్ల’ (1975), ‘వింత ఇల్లు సంతగోల’, ‘ఈ కాలపు పిల్లలు’ (1976), ‘ఏడడుగుల అనుబంధం’ (1979), ‘ధర్మచక్రం’, ‘సన్నాయి అప్పన్న’ (1980), ‘మహా పురుషుడు’ (1981), ‘తెలుగునాడు’ (1982), చివరి చిత్రం ‘ఇంటింటా దీపావళి’ (1990) వంటి సుమారు 30 చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఆయన తొలి, చివరి చిత్రాల నిర్మాత మన ప్రభాకర్‌డ్డి కావడం గమనార్హం.

జీవితంలో ఊహించిన దాన్ని సాధించిన వాళ్లు చాలా అరుదు. అలాంటి వారిలో ఒకడైన లక్ష్మీదీపక్ తాను దర్శకుడిని కావాలనుకుని స్వయంకృషితో ఆ స్థాయికి ఎదిగి జనరంజక చిత్రాలు తీశారు. మన తెలంగాణ నుండి సినిమా రంగంలోకి వెళ్లి ప్రభాకర్‌డ్డితో కలిసి అనేక ఉదాత్త చిత్రాలు తీసిన లక్ష్మీదీపక్ 2001 జూన్ 10న మృతి చెందారు. వారికి ‘బతుకమ్మ’ పాఠకుల తరఫున ఇవే నీరాజనాలు. 

మన దర్శక నిర్మాత బి. నర్సింగరావు


nrao1నూరేళ్ళకు చేరువవుతున్న ప్రపంచ చలనచిత్ర రంగ చరివూతలో కమర్షియల్ సినిమాకు భిన్నంగా, జీవితాలకు దగ్గరగా, సహజమైన సమాంతర సినిమాలను రూపొందించిన మహా దర్శకులు వేళ్ళ మీద లెక్కించ తగిన సంఖ్యలోనే ఉన్నారు.

మన సమాజంలో 0 శాతం ప్రేక్షకులను కమర్షియల్ సినిమా లాక్కుపోతుంది. మిగిలిన 20 శాతం మందిలో ఒక వర్గం ప్రేక్షకులు మాత్రమే న్యూవేవ్ సినిమాలను వీక్షిస్తున్నారు.

అమెరికా, యూరప్ దేశాలలో ఆర్ట్ సినిమాల కోసం ప్రత్యేక థియేటర్లు ఉన్నాయి. దురదృష్టవశాత్తు మనకు ఆ ఏర్పాటు లేదు.

సత్యజిత్‌రే, మృణాల్‌సేన్, ఆదూర్ గోపాలకృష్ణ, గౌతమ్ ఘోష్ వంటి దిగ్దర్శకులు భారతీయ చిత్రాలకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చి ప్రపంచ చలనచిత్ర శిఖరం మీద మన భారతీయ సినిమాకు గుర్తింపునిచ్చారు. ఆ కోవలో మూడు దశాబ్దాల క్రితమే సినీ రంగవూపవేశం చేసిన నూరణాల తెలంగాణ బిడ్డ మన బి.నర్సింగరావు.

ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. ‘కళ ప్రజలకోసమే’ అని బలంగా విశ్వసిస్తారు. తనదైన శైలిలో, నిబద్ధతతో సినిమా మాధ్యమాన్ని శక్తివంతంగా వాడుకుని భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరుగా ఎదిగారు. భారీ నిర్మాణ వ్యయం, ప్రచార ఆర్భాటం తప్ప రాష్ట్రం ఎల్లలు కూడా దాటని తెలుగు చిత్రాన్ని ‘మాభూమి’, ‘రంగుల కల’, ‘దాసి’, ‘మట్టి మనుషులు’ వంటి సమాంతర సినిమాలను నిర్మించి ‘మన వెండి వెలుగుల’ కీర్తి ప్రతిష్టలను అంతెత్తుకు పెంచిన ముద్దుబిడ్డ. ఒక్క మాటలో తెలుగు ‘రే’గా కీర్తించబడిన దర్శక, నిర్మాత మన బి. నర్సింగరావు.

రాష్ట్ర ప్రభుత్వం, ఇటీవల లలిత కళాతోరణంలో నిర్వహించిన ‘నంది అవార్డుల కార్యక్షికమంలో అలనాటి మేటి దర్శకులు బి.యన్.డ్డి అవార్డును 2010 సంవత్సరానికి గాను బి. నర్సింగరావుకు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆయన సినీ ప్రస్థానంపై ‘బతుకమ్మ’ ప్రత్యేక వ్యాసం...
ఈ ఉగాదికి ‘మాభూమి’ విడుదలై 32 సంవత్సరాలు. సరిగ్గా అదే రోజు నర్సింగరావు ‘బి.ఎన్.డ్డి పురస్కారం’ అందుకోవడం నిజంగానే విశేషం. ఆంధ్రా, తెలంగాణ అనే భేదం లేకుండా ‘శంకరాభరణం’ సినిమా ఆడిన థియేటర్లలోనే రెండు వందల రోజులు నడిచిన ‘మాభూమి’ తెలుగు చలన చిత్ర రంగంలోనే ఒక చారివూతాత్మకమైన విజయాన్ని నమోదు చేసుకుంది.
~ ‘దాసి’ సుదర్శన్

మృణాల్ సేన్, సత్యజిత్ రే, శ్యాంబెనగల్, ఆదూరి గోపాలకృష్ణన్, గౌతమ్ ఘోష్ వంటి భారతీయ దర్శకులు నర్సింగరావుకు స్ఫూర్తి. ఆ స్ఫూర్తితో మొదటినుండి జీవితాన్ని ప్రతిబింబించే వాస్తవ చిత్రాలనే రూపొందించారాయన.

nrao2‘‘సమస్యాత్మక ఇతివృత్తాలతో సినిమా తీయడం ఒక బాధ్యతగా భావిస్తాను. సమస్యల మధ్య జీవిస్తూ ఎంతో సేపు ఊహా ప్రపంచంలో ఉండలేం. కొన్ని జీవితాలు చూసి కవిత్వం రాసినట్లే నేను చిత్రాలుగా మలుస్తాను. జీవితాన్ని నటన అనుకరిస్తుంది, నటనను జీవితం అనుకరించదు. నటనే అయినా కళాత్మక సినిమా జీవితాన్ని దగ్గరగా చూపుతుంది. కమర్షియల్ సినిమా తీయడం చిన్న విషయమేమి కాకపోవచ్చు. కానీ, నేను దాని జోలికి వెళ్లను. ఆర్టు మూవీ తీయడమే నాకు తెలుసు’’ అని వినవూమంగా చెపుతారు నర్సింగరావు. ఇదీ ఆయన నిబద్ధత.

‘‘ప్రపంచమంతా వందలు, వేల సంఖ్యలో కమర్షియల్ సినిమాల ఉధృతి కొనసాగుతున్నప్పటికీ తార్కోవిస్కి, అకిరా కురుసోవా, బెర్గ్‌మెన్, ఐజన్ స్టీన్ వంటి మహామహుల సినిమాలే ప్రపంచ సినిమా ప్రియుల మదిలో ఆజరామర కళాఖండాలుగా నిలిచి ఉన్నాయి. కమర్షియల్ సినిమాకు డబ్బు వచ్చినా అది నీటి బుడగే’’ అని ఆర్టు ఫిలిం గొప్పతనాన్ని మనకు వివరిస్తారు నర్సింగరావు. ఇదీ ఆయన దృష్టి కోణం.

మాభూమి:ప్రముఖ దర్శకులు మృణాల్‌సేన్, శ్యాం బెనగల్ తెలుగులో ‘ఒక ఊరి కథ’, ‘అనుక్షిగహం’ అనే సినిమాలు తీసారు. అవి రెండూ ఫ్లాప్ అయినవే ఆ తర్వాత వచ్చిన మరో రెండు వాస్తవ చిత్రాలు ‘హరిజన్’, ‘ప్రత్యూష’ రిలీజ్‌కు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో వాస్తవిక చిత్రాన్ని ఎలాగైనా నిలబెట్టాలనే పట్టుదలతో 1945 నాటి తెలంగాణ సాయుధ పోరాట ఇతివృత్తంతో కిషన్ చందర్ రాసిన ‘‘జబ్ ఖేద్ జాగ్‌తేరహే’’ (పొలాలు మేల్కొన్నప్పుడు) నవలను గౌతం ఘోష్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ రవీంవూదనాథ్ వంటి మిత్రులతో కలిసి నర్సింగరావు 1979లో ‘మాభూమి’ సినిమాను నిర్మించారు. ఆంధ్రా, తెలంగాణ అనే భేదం లేకుండా ‘శంకరాభరణం’ సినిమా ఆడిన థియేటర్లలోనే రెండు వందల రోజులు నడిచిన ‘మాభూమి’ తెలుగు చలన చిత్ర రంగంలోనే ఒక చారివూతాత్మకమైన విజయాన్ని నమోదు చేసుకుంది.

‘మాభూమి’ చిత్రానికి నర్సింగరావు ఒక నిర్మాత, సహాయ దర్శకుడు, ప్రధాన పాత్రధారి కూడా. మహోత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని వెండితెర కెక్కించి, పోరాట చరివూతను అజరామరం చేసారు. కమర్షియల్‌గా, మ్యూజికల్‌గా (గద్దర్ పాటలతో) సూపర్ హిట్టయిన ‘మాభూమి’ చిత్రానికి ఏ అవార్డు రాకున్నా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచింది.

రంగుల కల: కళా ప్రపంచంలో మునిగిన సున్నిత మనస్కుడైన ఓ ఆర్టిస్టు పేదరికం, ఆకలి, నిరుద్యోగం... దైనందిన సమస్యలతో సతమతమవుతూనే తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసి ఆ ఆర్టిస్టుపడే అంతర్మధనం, స్పందనే ‘రంగుల కల’. 193లో విడుదలైన ఈ సినిమాకు కథ, సంగీతాన్ని అందించడంతో పాటు నర్సింగరావుగారు ప్రధాన పాత్రధారి, దర్శకులు కూడా. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘రంగుల కల’కు జాతీయ బహుమతి కూడా లభించింది.

దాసి: ఒకప్పటి నిజాం పరిపాలనలోని ఫ్యూడల్ శక్తుల అరాచక ధోరణిని, ‘దాసి’ వ్యవస్థలో స్త్రీలు గడిపిన దుర్భర జీవితాలనూ సరికొత్త సెల్యూలాయిడ్ భాష ద్వారా 19లో ‘దాసి’ చిత్రం అపూర్వంగా ఆవిష్కరించింది. జాతీయ స్థాయిలో ఈ సినిమా ఐదు అవార్డులు గెలుచుకుని సంచలనం సృష్టించింది. అంతర్జాతీయంగా ఇరవై చిత్రోత్సవాలలో ప్రదర్శనకు ఎన్నో అవార్డులూ, ప్రశంసలూ పొందింది. ఆస్ట్రేలియా, యూరప్ ఖండాలలో మూడుసార్లు టెలికాస్ట్ అయింది. మనాలీలో ఐ.ఏ.ఎస్., ఐ.పీ.ఎస్. అధికారుల శిక్షణా సిలబస్‌లో ‘దాసి’ ఒక సబ్జెక్టు.

మట్టి మనుషులు: పల్లె నుండి నగరానికి వలస వచ్చి, భవన నిర్మాణ కార్మికులుగా పొట్టపోసుకుంటూ, రియల్ ఎస్టేట్ వ్యాపారుల పదఘట్టన కింద నలిగిపోయిన ఓ పల్లెటూరి జంట జీవితాన్ని 1990లో ‘మట్టిమనుషులు’ చిత్రంగా మలిచారు నర్సింగరావు. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘మట్టి మనుషులు’ చిత్రానికి జాతీయ బహుమతి లభించింది. అమెరికాలో అన్ని విశ్వవిద్యాలయాల్లో కమ్యూనికేషన్స్, సినిమా కళను అభ్యసించే విద్యార్థులకు ‘మట్టి మనుషులు’ సినిమాను ప్రత్యేక అధ్యయన చిత్రంగా ప్రదర్శించారు. ఈ సినిమా గురించి ‘ది డైలీ’ పత్రిక రాస్తూ, ‘‘కఠోరమైన జీవిత వాస్తవాలను 7 నిముషాల ఈ చిత్రంలో చూడోచ్చని’’ ప్రశంసించింది. మాస్కో అంతర్జాతీయ చిత్రోత్సవంలో ఈ సినిమా ప్రదర్శించినప్పుడు ప్రసిద్ధ పత్రిక ‘ప్రావ్దా’ ‘‘ఈ చిత్రంలో నర్సింగరావు దర్శకత్వ ప్రతిభ ప్రతి ఫ్రేంలో కనిపిస్తుంది’’ అని ప్రశంసించింది.

మా వూరు: 1950ల నాటి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు, పండగలు, జానపద కళలకూ, ఆటపాటలకూ, జీవన విధానానికి అద్దం పట్టిన అద్భుత దృశ్యకావ్యం ‘మావూరు’. ఇది డాక్యుమెంటరీ చిత్రం. అంతరించి పోతున్న తెలంగాణ జానపద కళలు, శారదగాళ్ళు, చిడతల రామాయణం, దొమ్మరాట, గంగిద్దులాట ఇత్యాది కళలన్నింటినీ ‘మావూరు’ చిత్రం ద్వారా బి.నర్సింగరావు ముందు తరాల కోసం రికార్డు చేసిన విధానం అపూర్వం. ఆంథ్రోపాలజీ విభాగంలో 199లో ‘మా వూరు’ డాక్యుమెంటరీకి జాతీయ బహుమతి లభించగా, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఈ చిత్రాన్ని చూసిన అమెరికా డైరెక్టర్ ‘గాడ్ వూఫేరిగ్గో’ ఎంతో ముగ్ధులయ్యారు.

హరివిల్లు: ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడిగా పేరొందిన బి. నర్సింగరావు, అంతర్జాతీయ స్థాయి ఛాయా గ్రహకుడు ఏ.కె.బిర్, గిన్నీస్ రికార్టు క్రియేటర్ శతాధిక, బహుభాషా చిత్ర నిర్మాత డి. రామానాయుడు కాంబినేషన్‌లో మొట్టమొదటి అత్యాధునిక డిజిటల్ డాల్బీ సినిమాగా 2003లో ‘హరివిల్లు’ బాలల చిత్రం విడుదలయ్యింది. ఈ సినిమాకు కథ, దర్శకత్వం బి. నర్సింగరావే. 2003లో 34వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో కోల్‌కతా ఫిలిం ఫెస్టివల్లో, హైద్రాబాద్‌లో జరిగిన 13వ బాలల చిత్రోత్సవంలోనూ, 2004లో బంగ్లాదేశ్ ఢాకాలో జరిగిన అంతర్జాతీయ చిత్రోత్సవంలో, అలాగే కైరోలో జరిగిన చిత్రోత్సవాలలో ‘హరివిల్లు’ ప్రదర్శన జరిగింది. ఈ సినిమాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ వారి అవార్డుతో పాటు మరెన్నో ప్రతిష్టాత్మక బహుమతులు వచ్చాయి.

లఘు చిత్రాలు: ‘ది సిటీ’, ‘ఆకృతి’ వంటి లఘుచివూతాలను కూడా తనదైన ముద్రలో దర్శకులు బి. నర్సింగరావు గారు ఎంతో అందంగా నిర్మించి తెలుగు సినీ పరిక్షిశమలో తనదైన ముద్ర వేశారు.

‘ఆర్ట్ లవర్’ రంగులూ రాగాలు: 1971 ప్రాంతాల్లోనే నర్సింగరావు ‘ఆర్ట్ లవర్స్’ సంస్థను ప్రారంభించారు. వివిధ సామాజిక సమస్యలపై నాటకాలు, జానపద ప్రక్రియల ద్వారా ప్రదర్శనలిచ్చి ప్రజలను చైతన్యవంతం చేసారు. ‘జననాట్యమండలి’ ద్వారా ప్రజా వాగ్గేయకారుడు గద్దర్‌ను వెలుగులోకి తెచ్చారు. అన్నట్టు, వర్గీస్ పేరుతో మూడు దశాబ్దాల క్రితమే నర్సింగరావు ఎన్నో కవితలు, వ్యాసాలు రాసారు. జననం, అసావేరి, రంగులూ-రాగాలు తదితర గ్రంథాలనూ వెలువరించారు.

చిత్రకారుడు, ఫొటోక్షిగాఫర్ కూడా అయిన నర్సింగరావు పెయింటింగ్స్-ఫొటోక్షిగఫి ఎగ్జిబిషన్లు పలుమార్లు యూరప్ దేశాలలో, ఢిల్లీ వంటి మహా నగరాల్లో జరిగాయి.

నర్సింగరావు సేకరించిన హిందూస్తానీ, కర్నాటక జానపద సంగీతానికి సంబంధించిన అలనాటి వేలాది గ్రాంఫోన్ రికార్డులను సి.ఫెల్‌కు ప్రజెంట్ చేసారు.

తెలంగాణ ప్రాచీన సాహిత్యాన్ని, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విలువైన ‘యాంటిక్’ వస్తువులను పెద్ద ఎత్తున సేకరించిన నరసింగరావు వాటిని ప్రదర్శించడానికి మ్యూజియం ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు.
తెలంగాణ చరివూత, సాహిత్యంలో ఇప్పటి వరకు 10 గ్రంథాలకుపైగా ప్రచురించారు. తెలంగాణ రచయితలకు, కవులకు, సంకలన కర్తలకు నర్సింగరావుగారే పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నారు.
తెలంగాణ జిల్లాలలో ప్రముఖ చిత్రకారులు, ఔత్సాహికులతో తెలంగాణ ఇతివృత్తంలో పెయింటింగ్ వర్క్ షాపులు నిర్వహించి ప్రదర్శించడానికి సాయపడుతున్నారు.

మాస్కో అంతర్జాతీయ చిత్రోత్సవంలో ఈ సినిమా ప్రదర్శించినప్పుడు ప్రసిద్ధ పత్రిక ‘ప్రావ్దా’ పత్రిక ‘‘ఈ చిత్రంలో నర్సింగరావు దర్శకత్వ ప్రతిభకు ప్రతి ఫ్రేంలో కనిపిస్తుంది’’ అని ప్రశంసించింది.

Sunday, January 27, 2013

జానపద జగన్మోహనుడు- విఠలాచార్య

‘జురాసిక్ పార్క్’లో రాక్షస బల్లుల్ని చూసి స్పీల్‌బర్గ్‌కి సాహో అన్నాం.‘అవతార్’లో పండోర గ్రహ వాసుల్ని తిలకించి జేమ్స్ కేమరూన్‌కి హేట్సాఫ్ చెప్పాం. వాళ్లకంటే హైటెక్ కెమెరాలున్నాయ్! అడ్వాన్స్ గ్రాఫిక్సులున్నాయ్!!
మిలియన్ డాలర్ల బడ్జెట్‌లున్నాయ్!!! విఠలాచార్య దగ్గర ఇవేవీ లేవు. ఓ మిఛెల్ కెమెరా... రెండు, మూడు సెట్లు...
50, 60 వర్కింగ్ డేసు... మూణ్ణాలుగు లక్షల బడ్జెట్టు... వీటితోనే వెండితెరపై ఓ మంత్రనగరి సృష్టించిపారేశాడు. మంత్రాలూ మంత్రాంగాలు... పరకాయ ప్రవేశాలు... గుర్రపు స్వారీలు... కత్తి ఫైటింగులు... వింత పక్షులు, జంతువులు... పుర్రెలు అస్థిపంజరాలు... అబ్బో విఠలాచార్య సినిమా చూస్తుంటే మనకంటూ ఓ కొత్తలోకం తయారుగా ఉన్నట్టుంటుంది. ఎన్నేళ్లు గడిచినా విఠలాచార్య సినిమా మనల్ని ఊరించే, ఊయలూగించే ఓ మహేంద్రజాలం.
ఈ నెల 28న ఆయన జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం...
 

అరిసికరైలో విఠలాచార్య చాలా ఫేమస్. అరిసికరై అంటే కర్ణాటకలో చిన్న తిరుపతిలాంటిది. అక్కడి నుంచి అసలు తిరుపతికి భూమిలోంచి సొరంగమార్గం ఉందని నమ్మిక. అక్కడ విఠలాచార్యకో ఉడిపి హోటల్ ఉంది. తాలింఖానా ఉంది. ఆ హోటల్లో టిఫిన్ తింటే ఇక భోంచేయనవసరం లేదు. తాలింఖానా వస్తాదుల అడ్డా. రమణారెడ్డి లాంటోణ్ణి కూడా రాజనాలలా తయారు చేస్తారక్కడ. అది విఠలాచార్య సొంత ఊరేంకాదు. వాళ్లది ఉడిపి పక్కనున్న బెల్లి అనే పల్లెటూరు. విఠలాచార్యకు చదువు అబ్బలేదు కానీ, లోకజ్ఞానం బోలెడు. స్నేహితులతో కూర్చుని ఎప్పుడూ కథలూ కాకరకాయలూ. మంత్రాలూ తంత్రాలూ సాహసాలూ కలగలసిన రాజుల కథలన్నీ చదివేసి తానే రాజకుమారుడైపోయినట్టు ఒకటే కలలు. 

విఠలాచార్య తొమ్మిదేళ్ల వయసులో హోటల్లో పనిచేశాడు. తర్వాత దాన్నే కొనిపారేశాడు. ఓ పక్క బిజినెస్‌లో బిజీగా ఉంటూనే, మరో పక్క నాటకాల్లో వేషాలు, కత్తిసాములు, కుస్తీ పట్లు. ఏదైనా కుస్తీ పోటీకి వెళ్తే విఠలాచార్య ట్రూప్ ఖాళీ చేతులతో వచ్చేది కాదు. అదే సమయంలో స్వాతంత్య్రోద్యమం ఊపందుకుంది. గాంధీజీ పిలుపు మేరకు కుర్రాళ్లంతా రామదండుల్లా కదలసాగారు. వాళ్లల్లో విఠలాచార్య కూడా ఉన్నాడు. లాఠీ దెబ్బలు తిన్నాడు. జైలుకి కూడా వెళ్లాడు. ఆ ఊళ్లోనే బ్రూక్ బాండ్ ఏజెన్సీ నడిపే శంకర్‌సింగ్, విఠలాచార్యకు మంచి దోస్త్. శంకర్‌సింగ్‌కి సినిమా ఫీల్డ్‌తో టచ్ ఉంది. శంకర్‌సింగ్, విఠలాచార్య ఇంకొంతమంది కలిసి మైసూర్‌లో రెండు టూరింగ్ టాకీసులు అద్దెకు తీసుకున్నారు. ఏ సినిమాకి గల్లాపెట్టె నిండుతుంది, ఏ సీన్‌కి విజిల్స్ పడుతున్నాయన్నది విఠలాచార్యకు అర్థమవుతోంది. జెమినీ వారి జానపదాలొస్తే థియేటర్ హౌస్‌ఫుల్. అసలే జానపద కథలు ఔపోసన పట్టిన విఠలాచార్యకు జానపద సినిమాలంటే ప్రేమ మొదలైపోయింది.

టూరింగ్ టాకీస్ వ్యాపారం లాభాలు తీసుకురావడంతో ఈ మిత్ర బృందం కన్ను సినిమా నిర్మాణంపై పడింది. ‘మహాత్మ పిక్చర్స్’ పెట్టి మొదట కన్నడంలో ‘కృష్ణలీల’ తీశారు. పెద్ద హిట్టు. అదే జోరు మీద ‘భక్త రామదాస’ తీస్తే గూబ గుయ్‌మంది. డబ్బులన్నీ పోయాయి. జీప్ మిగిలింది. దాంతోనే మళ్లీ బతుకు ప్రయాణం మొదలుపెట్టాలి. మైసూర్ రైల్వేస్టేషన్ నుంచి అరిసికరైకు టాక్సీలా తిప్పారు. కాసేపు శంకర్‌సింగ్ డ్రైవర్ అయితే, విఠలాచార్య కండక్టర్. ఇంకాసేపు విఠలాచార్య డ్రైవ్ చేస్తే, శంకర్‌సింగ్ డబ్బులు వసూలు చేసేవాడు. ఏ పిచ్చి అయినా వదులుతుందేమో కానీ, సినిమా పిచ్చి మాత్రం జీవితాంతం వదలదంటారు. జేబులో కాసులు గలగలలాడడం మొదలు కాగానే మళ్లీ వీళ్లల్లో సినిమా టిమటిమలు మొదలయ్యాయి. ఈసారి జానపదాన్ని నమ్ముకున్నారు. వాళ్లు తీసిన ‘నాగ కన్నిగె’ సినిమా కాసుల వర్షం కురిపించింది.

ఈ మూడు సినిమాల అనుభవంతో ఈసారి విఠలాచార్యనే డెరైక్షన్ చేశారు. సినిమా పేరు ‘జగన్మోహిని’ (1953). కన్నడంలో తొలి సిల్వర్ జూబ్లీ. అయితే డెరైక్టర్‌గా విఠలాచార్య తన పేరు వేసుకోకుండా శంకర్‌సింగ్ పేరు పెట్టారు. ఆ తర్వాత చాలా సినిమాలు తీశారు. బోలెడంత పేరు ప్రఖ్యాతులు. అయితే ఓ వివాదం వల్ల విఠలాచార్య మళ్లీ కన్నడ సినిమా తీయకూడదని ఒట్టు పెట్టుకున్నారు. కొంతమంది కన్నడ జర్నలిస్టులు ఈయన మీద వరుసగా విమర్శల బాణాలు ఎక్కుపెడుతుండేవారు. దాంతో ఆయనకు ఒళ్లు మండి జర్నలిస్టుల బాగోతాలమీద ఓ వ్యంగ్య చిత్రం తీశారు. వాళ్లేమో కోర్టుకెక్కారు. సినిమా ఫ్లాపయినా, కోర్టులో విఠలాచార్య సక్సెసయ్యారు. దాంతో వాళ్లు రాజీకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనకు కన్నడ సినిమాలు చేయాలన్న ఆసక్తి చచ్చిపోయింది. దానికి తోడు తన జాతకంలో పరభాషలో సినిమాలు చేస్తేనే ఫలితం అని రాసి పెట్టి ఉంది. దాంతో తన మకాం మొత్తం మద్రాసుకు మార్చేశారు.

1955... విఠల్ ప్రొడక్షన్స్ బేనర్‌లో ‘కన్యాదానం’ సినిమా. తెలుగులో విఠలాచార్యకు తొలి ప్రయత్నం. కాంతారావు హీరో. ‘షావుకారు’ జానకి హీరోయిన్. అప్పటికి విఠలాచార్యకు తెలుగు ఒక్క ముక్క కూడా రాదు. షూటింగ్ మొదలయ్యేలోపు తెలుగు నేర్చేకోవాలని పట్టు పట్టాడాయన. సాధించాడు కూడా. అయితే ‘కన్యాదానం’ ఆయనకు లాభించలేదు. తర్వాత ‘వద్దంటే పెళ్లి’. అదీ ఫలించలేదు. అప్పుడు ఆయనకు తన ఒరలో ఉన్న బ్రహ్మాస్త్రం గుర్తుకొచ్చింది. అదే ‘జానపదం’.

కాంతారావు, రాజనాలతో తీసిన ‘జయ విజయ’ బాగా ఆడింది. ఇక అక్కడ నుంచీ ఒక్కో జానపదం ఎక్కుపెడుతూ ఉంటే బాక్సాఫీస్‌కి గురి తప్పేది కాదు. తెలుగులో అంతకుముందు జానపదాలు వచ్చాయి. అవో తరహా. విఠలాచార్య స్కూలే వేరు. అంతా మాస్ స్టయిల్. నో లాజిక్స్.. ఓన్లీ మేజిక్స్. ఒకే తాను ముక్కల్లా అనిపించే కథలు. స్టార్ల హంగామా అస్సల్లేదు. పరిమితమైన బడ్జెట్. అయినా జనాలు విఠలాచార్య సినిమా అంటే విరగబడి చూశారు. ‘విఠలాచార్య’ అంటేనే తిరుగులేని బ్రాండ్.

అగ్నికి వాయువు తోడైనట్టుగా విఠలాచార్యకు ఎన్టీఆర్ కలిశాడు. ఇక ప్రభంజనం మొదలయ్యింది. అప్పటికి ఎన్టీఆర్‌కున్న మాస్ ఇమేజ్‌ని విఠలాచార్య ఇంకెక్కడికో తీసుకెళ్లిపోయాడు. చిత్రవిచిత్రమైన కథలు, రకరకాల మారువేషాలు, ఒళ్లు గగుర్పొడిచే సాహసాలు... మాస్ జనానికి పండగే పండగ. ఒకటా, రెండా... ఇద్దరూ కలిసి 16 సినిమాలు చేశారు. ఒకదాన్ని మించి మరొకటి. వీరిద్దరూ కలిసి చేసిన తొలి సినిమా ‘బందిపోటు’ ఓ ట్రెండ్‌సెట్టర్. హాలీవుడ్‌లో పాపులర్ అయిన రాబిన్‌హుడ్ తరహా హీరోయిజాన్ని ఇందులో ఎన్టీఆర్ పాత్రకు ఆపాదించారు. ఆ తర్వాత ‘అగ్గిపిడుగు’. ఇద్దరు ఎన్టీఆర్లతో చెడుగుడు ఆడించేశారు. ‘మంగమ్మ శపథం’లో ఎన్టీఆర్‌తో తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేయించారు. ఒక హీరో తండ్రీకొడుకులుగా డ్యూయెల్ రోల్ చేయడం ఇదే ప్రథమం. కాంతారావుతో కూడా విఠలాచార్య ఎక్కువ సినిమాలు చేశారు. కాంతారావుక్కూడా మాస్ ఫాలోయింగ్ వచ్చింది ఆ సినిమాలతోనే. 

రోజులెప్పుడూ ఒకేలా ఉండవు. జానపదాలపై జనాలకు మొహం మొత్తసాగింది. డిష్యుం డిష్యుం సినిమాలతో ప్రేక్షకులకు కొత్త రుచులు దొరకసాగాయి. ఇప్పుడు తనేం చేయాలి? రూటు మార్చాలా? ఎన్టీఆర్‌తో ‘నిన్నే పెళ్లాడతా’ తీశాడు. ఫలితం దక్కలేదు. ఏయన్నార్‌తో ‘బీదలపాట్లు’. జనానికి ఈ పాట్లు కూడా నచ్చలేదు. ఎవ్వరు మారినా విఠలాచార్య మారకూడదన్నారు ప్రేక్షకులు. ఆ కామెంట్లు ఆయన చెవినా పడ్డాయి. మళ్లీ తన కత్తులకి పదును పెట్టాడు. సీసాలో దాచిపెట్టిన భూతాలను బయటికి తీశాడు. అలా పుట్టిందే ‘జగన్మోహిని’. శృంగార నర్తకి జయమాలిని లీడ్ రోల్. నరసింహరాజు హీరో. ఒకప్పుడు తను తీసిన సినిమానే. మళ్లీ రీమేక్ అన్న మాట. 

7 లక్షల బడ్జెట్. 30 రోజుల్లోనే అవలీలగా తీసిపారేశాడు. ఈ సినిమా రిలీజ్‌కి ముందే మూడు భారీ జానపదాలు (ఎన్టీఆర్ ‘రాజపుత్ర రహస్యం’, ‘సింహబలుడు’, కృష్ణ ‘సింహగర్జన’) ఢామ్ అన్నాయి. అయినా విఠలాచార్య డోంట్‌కేర్. ‘జగన్మోహిని’ చూసి జనం వెర్రెత్తిపోయారు. పొట్టేలు మనుషులను ఢీ కొనడం, పులితో తలపడడం, పాము-గద్దల పోరాటం, పాముని మెడలో వేసుకుని పొట్టేలు పరిగెత్తడం, సారథితో దెయ్యాలు ఆటాడుకోవడంలాంటివి చూసి పెద్దాళ్లు కూడా చిన్నపిల్లలైపోయారు. ఇదే ఆయన ఆఖరి సూపర్ హిట్. ఆ తర్వాత ఏవో సినిమాలు చేశారు కానీ, ఏవీ విఠలాచార్య స్థాయిలో లేవు. ఓ పక్క పెరిగిన వయసు, ఇంకోపక్క అనారోగ్యం, మరోపక్క పరిశ్రమలో మారిన పరిస్థితులు మెల్లిగా ఆయనకు రిటైర్‌మెంట్ ఇచ్చేశాయి. కాదు... కాదు... రిటైర్డ్ హర్ట్ చేశాయి.

33 ఏళ్ల కెరీర్‌లో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 60కు పైగా సినిమాలు చేశారు. వీటిల్లో తెలుగు సినిమాలే సుమారు 40 వరకూ ఉన్నాయి. విఠలాచార్య సినిమాల్లోని మాయలు, మంత్రాల గురించి చెప్పుకుంటే పెద్ద హిస్టరీనే అవుతుంది. ఆయన సినిమా కథలు చూస్తే ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడ్డట్టుగా అనిపిస్తాయి. కానీ, వాటికి బలమైన మూలాలే ఉన్నాయి. కాశీమజిలీ కథలు, అరేబియన్ నైట్స్, కాశ్మీర రాజకుమార కథలు, చైనీస్ ఫోక్ స్టోరీస్, రష్యన్ ఫోక్ టేల్స్... ఇలాంటివన్నీ ఆఘ్రాణించేసి కథలు సృష్టించేవాడు. ‘చందమామ’ పుట్టుక దగ్గరనుంచీ కన్నడ, తెలుగు ప్రతులన్నీ బైండ్ చేయించి పెట్టుకున్నాడు. వాటిల్లోని బొమ్మలతోటే పాత్రల మీసాలు, విగ్గులు, దుస్తులు చేయించేవాడు. 

ఆయన తీసే స్పీడు చూస్తే పూరి జగన్నాథ్ కూడా పనికి రాడేమో! ఒక్క రోజులో పది సీన్లు తీయాలనుకుంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ తీసేయాల్సిందే. సినిమా మొత్తానికి ఒకటే సెట్టు. దాన్నే అటూ ఇటూ మార్చేసి రకరకాల యాంగిల్స్‌లో షూట్ చేసేవాడు. కాసేపు అదే రాజదర్బార్. ఇంకాసేపు అదే విలన్ సమాలోచనా మందిరం. కాస్ట్యూమ్స్ కూడా దాదాపుగా అన్ని సినిమాలకు ఒకటే. కొంచెం అటూ ఇటూ మార్పులు చేసి వాడెయ్యడమే. రాజులకైనా, సైనికులకైనా అవే దుస్తులు, అవే కిరీటాలు. అంతకుముందు జానపద హీరోలకు పంచెకట్టే. విఠలాచార్య వచ్చాక రోమన్ తరహాలో స్కిన్ టైట్ నైలాన్ ప్యాంట్లు మొదలయ్యాయి.

డబ్బు దగ్గర విఠలాచార్య చాలా నిక్కచ్చి. ప్రొడక్షన్ మేనేజర్‌తో కాకుండా పారితోషికాలన్నీ తనే స్వయంగా మాట్లాడేవారు. మిగతావాళ్లకన్నా ఒక రూపాయి తక్కువిచ్చినా, చాలా ఫెర్‌ఫెక్ట్‌గా పువ్వుల్లో పెట్టి మరీ నెలవారీ జీతాలుగా అందించేవారు. విఠలాచార్య సినిమాలో ఛాన్సొచ్చిందంటే చిన్నా చితకా ఆర్టిస్టులకు కొన్ని నెలలు భరోసా. విఠలాచార్య తన సినిమాలకు ఎప్పుడూ ఫంక్షన్లు కూడా చేసేవారు కాదు. సినిమాకు 50 రోజుల టాక్ వస్తే 40 రోజులకు, 100 రోజుల టాక్ వస్తే 70 రోజులకు తీయించేసేవారు. మనీ మేనేజ్‌మెంటే కాదు టైమ్ మేనేజ్‌మెంట్‌లోనూ ఆయన పర్‌ఫెక్టే. మిన్ను విరిగి మీద పడ్డా నో టెన్షన్. ఓసారేమైందంటే - ఓ ప్రముఖ హీరో కాల్షీట్ ఇచ్చి షూటింగ్‌కి రాలేదు. 

ఇంకొకరైతే కంగారుపడిపోయి షూటింగ్ పేకప్ చెప్పేసేవారు. విఠలాచార్య మాత్రం తాపీగా ఆ సీన్ మార్చేసి హీరో పాత్రకు ముని శాపం ఇస్తే, పక్షిగా మారిపోయినట్టుగా షాట్ తీసిపారేశారు. ఇది తెలిసి ఆ హీరో కిమ్మనలేదు. మళ్లీ ఎప్పుడూ ఆయన దగ్గర అలాంటి వేషాలు వేయలేదు. మిగతా సాంకేతిక నిపుణుల సంగతి ఎలా ఉన్నా, కెమెరామేన్‌ని మాత్రం గట్టివాణ్ణే తీసుకునేవారు. ఎందుకంటే ఆయన సినిమాల్లో ట్రిక్‌వర్క్ ఎక్కువ. రవికాంత్ నగాయిచ్, హెచ్.ఎస్. వేణు లాంటి ఛాయాగ్రాహకులు విఠలాచార్య సినిమాల తోనే బాగా పాపులరయ్యారు. అగ్గిపిడుగు, జ్వాలాద్వీప రహస్యం లాంటి సినిమాల్లో కెమెరా వర్క్ ఇప్పుడు చూసినా అబ్బురంగా అనిపిస్తుంది.

విఠలాచార్య ఎప్పుడూ పెద్దపెద్ద మ్యూజిక్ డెరైక్టర్లను కూడా పెట్టుకోలేదు. తనకు అనువుగా ఉండేవాళ్లతోనే ఎక్కువ పనిచేసేవారు. రాజన్-నాగేంద్ర, విజయా కృష్ణమూర్తి లాంటి వాళ్లు ఆయనకు ఆస్థాన సంగీతదర్శకులు. విఠలాచార్య సినిమాల్లో పాటలూ బావుంటాయి. దేశవాళీ పాటలు, దేశీవాళీ నృత్యాలతో కొంచెం హంగామానే చేసేవారు.

తనకు సాయం చేసినవారి పట్ల చాలా కృతజ్ఞత చూపేవాడాయన. విజయా స్టూడియోలో తక్కువ అద్దెకు తనకు షూటింగ్ ఏర్పాట్లు చేయించారని నాగిరెడ్డి పట్ల ఎప్పుడూ కృతజ్ఞతగా మెలిగేవారు. అందుకే నాగిరెడ్డికి తన కన్నడ సినిమాల పరభాషా హక్కులన్నీ ఇచ్చేసేవారు. విజయావారు తీసిన గుండమ్మ కథకు మూలం విఠలాచార్య తీసిన కన్నడ సినిమా ‘మనే తుంబెద హెణ్ణు’. అలాగే ‘మాయాబజార్’ను కన్నడంలో చాలా తక్కువ ఖర్చుతో అనువాదం చేసిచ్చారు. విఠలాచార్య సినిమాలన్నీ తమిళం, హిందీల్లోకి డబ్ అయ్యేవి. అక్కడ కూడా ఆయనంటే మంచి క్రేజ్. థాయ్‌లాండ్, మలేసియా, సింగపూర్, బర్మా, దక్షిణాఫ్రికాల్లో కూడా బాగా ఆడేవి.

ఆయనది చాలా పెద్ద కుటుంబం. నలుగురు మగపిల్లలు, నలుగురు ఆడపిల్లలు, పెద్దబ్బాయి బి.వి. శ్రీనివాస్‌ని ‘అగ్గిదొర’తో దర్శకునిగా పరిచయం చేశారు. అగ్గివీరుడు, నిన్నే పెళ్లాడుతా, రైతే రాజు సినిమాలు డెరైక్ట్ చేసిన బీవీ శ్రీనివాస్ పెద్దగా రాణించలేకపోయాడు. ఇంకో అబ్బాయి రాజన్ కూడా ఓ సినిమాకు దర్శకత్వం చేశారు గానీ, గుర్తింపు రాలేదు. చాలా మంది పిల్లలు విదేశాల్లో స్ధిరపడిపోయారు. మద్రాసు పురశవాకంలో విఠలాచార్యకు పెద్ద బంగ్లా ఉండేది. 

విఠలాచార్య జనరంజక చిత్రాలు
కన్యాదానం (1955)
జయవిజయ (1959)
అన్నా చెల్లెలు (1960)
మదనకామరాజుకథ (1962)
బందిపోటు (1963)
అగ్గిపిడుగు (1964)
నవగ్రహ పూజామహిమ (1964)
గురువును మించిన శిష్యుడు (1965)
మంగమ్మ శపథం (1965)
జ్వాలాద్వీప రహస్యం (1965)
పిడుగురాముడు (1966)
అగ్గిబరాటా (1966)
చిక్కడు-దొరకడు (1967)
గండికోట రహస్యం (1969)
కదలడు-వదలడు (1969)
ఆలీబాబా 40 దొంగలు (1970)
లక్ష్మీకటాక్షం (1970)
రాజకోట రహస్యం (1971)
ఖైదీ కన్నయ్య (1971)
జగన్మోహిని (1978) 



నటునిగా విఠలాచార్య 
విఠలాచార్యలో మంచి నటుడు కూడా ఉన్నారు. సినిమాల్లోకి రాకముందు రంగస్థలంపై అనేక వేషాలు వేశారు. కొన్ని కన్నడ సినిమాల్లో హాస్య పాత్రలు పోషించారు. 

ముందే తెలిసిన మరణం
విఠలాచార్యకు జ్యోతిష్యం మీద మంచి పట్టుంది. ‘‘అశ్వనీ నక్షత్రం రెండోపాదం, మేషరాశి, మూడోసారి ఏలిననాటి శని ప్రవేశించి జన్మ శని జరుగుతుండగా విఠలాచార్య అనే నేను చనిపోతాను’’ అని తన డైరీలో రాశారు. 1999 మే 28న అదే జరిగింది.

పైన ఆఫీసు, కింద కాపురం, చిన్నాచితకా ఎవరొచ్చినా కాఫీ ఇచ్చి పంపించేవారు. ఆ ఇంటి ఆవరణలోనే రాము అనే కపిల గోవుని పెంచుకునేవారు. రోజూ ఆ గోవుకి పసుపు, కుంకుమ బొట్లు పెట్టి చుట్టూ ప్రదక్షిణ చేసేవారు. అది ముసలిదయ్యాక కూడా ప్రాణపదంగా చూసుకున్నారు. తన సినిమాల నెగిటివ్‌లన్నీ తన ఆఫీసులోనే ఏసీ రూమ్‌లో భద్రపరిచారు. వాటిని చూసేందుకు ఒక ఉద్యోగిని కూడా నియమించుకున్నారు. విఠల్ సంస్థలో పని చేసిన చాలా మంది ఆ తరువాత కాలంలో ఉచ్చస్థితికి చేరుకున్నారు. దర్శకులు ఎస్.డి.లాల్, వైకుంఠరామశర్మ, సిద్ధలింగయ్య, ఎడిటర్ మోహన్, మేకప్‌మేన్ ఏఎమ్ రత్నం లాంటి వాళ్లు ఆ సంస్థలో పని చేసిన వారే. 

‘‘ప్రస్తుతానికి జానపదం తెరమరుగైపోయి ఉండొచ్చును. కానీ ఎప్పటికైనా మళ్లీ జానపదానికి జీవం వస్తుంది. కొత్తతరం వాళ్లు కొత్త ఆలోచనలతో సరికొత్త భావాలతో మార్పులకనుగుణంగా తీస్తే జానపదానికి మళ్లీ పూర్వ వైభవం వస్తుంది’’ అని ఓ సందర్భంలో విఠలాచార్య అన్నారు. ఏమో.... ఆ రోజు వస్తుందేమో! వచ్చేసిందేమో కూడా! దర్శకుడు రాజమౌళి - ప్రభాస్‌తో చేస్తున్న సినిమా ఫక్తు జానపదం. ఆ సినిమాతోనైనా విఠలాచార్య మాట నిజమవుతుందేమో! ఆయన కల ఫలిస్తుందేమో! 
- పులగం చిన్నారాయణ
- బి. విఠలాచార్య


www.sakshi.com

Sunday, December 2, 2012

‘విజయ’ సామ్రాజ్యాధీశుడు - బి.నాగిరెడ్డి


పాతాళభైరవి... మాయాబజార్... మిస్సమ్మ... జగదేకవీరుని కథ... గుండమ్మ కథ....
ఈ అయిదు సినిమాలూ మనకు రాలేదనే అనుకుందాం. అప్పుడేంటి పరిస్థితి?
జస్ట్! ఒక్కసారి ఊహించుకోండి. కిరీటం కోల్పోయిన ఛత్రపతిలా, జాబిల్లి లేని గగనంలా, పరిమళం తెలియని జాజిపూల మాలలా... తెలుగు సినిమా కనిపించదూ! ఎవరైనా ఒక్క మేలు చేస్తేనే మనం గుండెల్లో పెట్టి పూజించేసుకుంటాం. మరి ఇంత మేలు చేసిన బి.నాగిరెడ్డి రుణం ఎలా తీర్చుకోవాలి? ఓ విజయా సంస్థనీ- ఓ చందమామనీ - తెలుగు సినిమాకి ఓ సత్సంకల్పాన్నీ -

ఓ క్రమశిక్షణనీ అందించిన బి.నాగిరెడ్డికిది శతజయంతి సంవత్సరం. మరో వందేళ్లయినా ఆయన చిరంజీవే!

విజయం... ఓ సుదీర్ఘ రాత్రి ప్రసవించిన స్వప్నం కాదు. ఎండా వానా కలగలిసి ప్రభవించిన ఇంద్రధనస్సూ కాదు. రక్తాన్ని చెమటగా మరిగిస్తే పుట్టిన ప్రతిబింబమూ కాదు. విజయం అంటే ఓ కళ. ఆ కళలో ఆరితేరిన వ్యక్తి బి.నాగిరెడ్డి.
ఉల్లిపాయల వ్యాపారం చేసినవాడు... వీధుల్లో పోస్టర్లు కట్టించినవాడు... అందంగా శుభలేఖలు అచ్చు వేయించినవాడు... ఊరూరా తిరిగి ఖద్దరు అమ్మినవాడు... తెలుగు సినిమా జెండాపై కపిరాజు ఎలా కాగలిగాడు?

‘పాతాళ భైరవి’లో తోటరాముడు రాజకుమారిని వరించినట్టే, మాంత్రికుణ్ని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించినట్టే, బి.నాగిరెడ్డి కూడా అసాధ్యాలను సుసాధ్యం చేశాడు. అవరోధాల్ని ఫెటీల్మని ఒక్క తన్ను తన్నాడు. తను కష్టాల్ని ఎదురీదిన గజ ఈతగాడు. లక్ష్యం గురి తప్పని విలుకాడు.

‘జగదేకవీరుని కథ’లాగానే బి.నాగిరెడ్డి కథ కూడా ఆసక్తికరమే!

అనగనగా ఓ పల్లెటూరు. కడప జిల్లా పొట్టిపాడు. చుట్టూ కొండలు, పొలాలు, పచ్చని గాలులు, కోకిలలు, పిచ్చికలు, స్వచ్ఛమైన మనుషులు... వీటన్నిటి మధ్యా పెరిగాడు నాగిరెడ్డి. అందుకే తనలోనూ అంతా పచ్చదనం. పచ్చిదనం. నాగిరెడ్డి నాన్న బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి అంటే ఆ ఊళ్లో మహాగౌరవం. ఆయనకు నలుగురు కొడుకులు. రెండోవాడు నాగిరెడ్డి.
నాగిరెడ్డి అమ్మ కొంగు పట్టుకునే తిరిగేవాడు. అమ్మకు పువ్వులు కోసిచ్చేవాడు. గడ్డి కోసిచ్చేవాడు. ఇదంతా చూసి అమ్మ మురిసిపోయేది. నువ్వు ఆడపిల్లగా పుట్టినా బావుండేదిరా అని ముద్దులాడేది.

నాగిరెడ్డికి తెల్లవారుజామున మెలకువ వచ్చిందంటే నాలుగైనట్టు లెక్క. ఆ లెక్క చివరివరకూ తప్పలేదు. పశువుల కొట్టంలోకి వెళ్లి చీపురు పట్టుకుని శుభ్రం చేసేవాడు. గొడ్లతో కాసేపు అటూ ఇటూ వాకింగ్ చేయించేవాడు. సాయంత్రం పూట అయ్యవారొచ్చేవారు. రామాయణం, భారతం, భాగవతం విడమరిచి చెప్పేవారు. నాగిరెడ్డికి పన్నెండేళ్లకే అవన్నీ కంఠతా వచ్చేశాయి.
భారత, భాగవతాలను మించిన డిగ్రీలు, పీహెచ్‌డీలు ఏముంటాయ్?

తాటాకింటికైనా, తాజ్‌మహల్‌కైనా పునాది ఉండాల్సిందే. నాగిరెడ్డికి పొట్టిపాడే పెద్ద పునాది.

నరసింహారెడ్డికి రకరకాల వ్యాపారాలు. మద్రాసులో కమిషన్ వ్యాపారం మొదలెట్టారు. పిల్లల్ని బాగా చదివిద్దామని కూడా తీసుకెళ్లారు.

మద్రాసులో కొత్త జీవితం.

స్వాతంత్య్రోద్యమం ముమ్మరంగా జరుగుతున్న రోజులవి. నాగిరెడ్డిలోనూ దేశభక్తి మొదలైంది. స్కూలుకు డుమ్మాకొట్టి మరీ ఉద్యమాల్లో తిరగసాగాడు. తండ్రి మందలించినా తగ్గలేదు. దాంతో తండ్రి మళ్లీ ఊరు పంపేశాడు. అయినా నాగిరెడ్డి మారలేదు. ఊరూరా తిరుగుతూ ఖద్దరు అమ్మేవాడు.
నరసింహారెడ్డి రంగూన్‌లో ఉల్లిపాయల వ్యాపారం మొదలెట్టారు. అక్కడ చూసుకునే మనిషి కావాలి. నాగిరెడ్డిని మించిన దక్షుడు ఎవరు?

నాగిరెడ్డి ఛలో రంగూన్.

అక్కడ మళ్లీ కొత్త జీవితం. వ్యాపారమంటే ఏదో వ్యవహారమన్నట్టు కాకుండా వాటిలోని మర్మాల్ని బాగా ఆకళింపు చేసుకోగలిగాడు.

మళ్లీ మద్రాసొచ్చేశాడు. ఇంట్లోవాళ్లు మంచి పిల్లనిచ్చి పెళ్లి చేశారు. హ్యాపీ లైఫ్.
ఓ పక్క వ్యాపారం. ఇంకోపక్క సంసారం. వీళ్లకు బి.ఎన్.కె. ప్రెస్ కూడా ఉంది. శుభలేఖలు, పుస్తకాలు అచ్చు వేస్తుంటారు. ఇవన్నీ నాగిరెడ్డే చూసుకోవాలి.

ఎందుకంటే అన్నయ్య బి.ఎన్.రెడ్డికి ఈ వ్యాపారాలు నచ్చవు. ఆయనదంతా సినిమా ప్రపంచం. హెచ్.ఎం.రెడ్డితో కలిసి ‘గృహలక్ష్మి’ సినిమా తీశారు. ఏవో తేడాలొచ్చి రోహిణీ సంస్థతో తెగతెంపులు చేసేసుకున్నారాయన. అప్పుడే వాహినీ సంస్థ పుట్టింది. వాహినీ పుట్టుకలో నాగిరెడ్డికీ వాటా ఉంది. అన్నగారి సామర్థ్యం తెలుసు కనుక, కొత్త సంస్థ పెడదామని గట్టిగా వత్తాసు పలికాడు.
రోజంతా వ్యాపారంలో మునిగి తేలినా కూడా సాయంత్రమయ్యేసరికి వాహినీ ఆఫీసులో తేలేవాడు నాగిరెడ్డి. కథాచర్చలు, పాటలు, వాతావరణం... నాగిరెడ్డికి ఆసక్తిగా అనిపిస్తుండేది.

‘సుమంగళి’, ‘భక్తపోతన’ సినిమాలకు నాగిరెడ్డే ప్రచారకర్త. తక్కువ డబ్బుతో ఎక్కువ ప్రచారం ఎలా చేయాలో నాగిరెడ్డికి తెలియకుండానే తెలిసిపోయింది. కరపత్రాలు పంచడం, కటౌట్లు పెట్టించడం లాంటి కొత్త్త ప్రయత్నాలు చేశారు. ‘జెమినీ’వాసన్ లాంటివాడే ఈ పబ్లిసిటీకి ఆశ్చర్యపోయాడు.

నాగిరెడ్డికి అవకాశాల్ని సృష్టించుకోవడమూ తెలుసు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమూ తెలుసు.

నాగిరెడ్డి జీవితంలో ఓ ఊహించని మలుపు! వాహినీ సంస్థకు మెయిన్ పిల్లర్ అయిన మూలా నారాయణస్వామికి ఇన్‌కమ్‌ట్యాక్స్ నోటీసులొచ్చాయి. అర్జెంట్‌గా ఆయనకు డబ్బులు కావాలి. నాగిరెడ్డి రంగంలోకి దిగారు. డబ్బు సర్దుబాటు చేశారు. అలా ‘వాహినీ’ నాగిరెడ్డి అజమాయిషీలోకొచ్చింది.
అప్పటికే వాహినీ స్టూడియో సగం నిర్మాణంలో ఉంది. నాగిరెడ్డికి స్టూడియో ఇంపార్టెన్స్ తెలుసు. అందుకే దాన్ని మొత్తం రెడీ చేశారు.

ఇక్కడ ఇంకో మలుపు.

ఓరోజు నాగిరెడ్డి ప్రెస్‌లో కూర్చుని ఉన్నప్పుడు ఓ బక్కపలుచటి వ్యక్తి వచ్చాడు. నవలలు ప్రింట్ చేయాలని అడిగాడు. ఇద్దరూ మాటల్లో పడ్డారు. ఒకరి వ్యక్తిత్వాలు ఒకరికి నచ్చాయి. ప్రెస్సు పుణ్యమాంటూ ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు. అర్జునునికి కృష్ణుడు తోడయ్యాడు.

నాగిరెడ్డి ఏం చేసినా అతని సలహా తీసుకునేవాడు. ఆయనే చక్రపాణి. నాగిరెడ్డి ఆరోప్రాణం. ఇద్దరూ కలిసి సినిమా చేద్దామనుకున్నారు. చేతిలో స్టూడియో ఉంది. చక్రపాణి దగ్గర కథ ఉంది. బ్యానర్ పెట్టాలి. అంతే!
నాగిరెడ్డి పెద్దకూతురి పేరు జయలక్ష్మి. తనంటే ఇంట్లో అందరికీ ప్రాణం. చక్రపాణిక్కూడా! తను పుట్టాకే ఇంట్లో బావిలో తియ్యటి నీళ్లు పడ్డాయి. అప్పటినుంచీ జయ అంటే ఓ సెంటిమెంటు. ఆమె పేరు కలిసొచ్చేలా ‘విజయా ప్రొడక్షన్స్’ అని పెట్టారు. ‘జెండాపై కపిరాజు’ ఎంబ్లమ్!

నాగిరెడ్డికి సినిమా ఫక్తు వ్యాపారమని తెలుసు. అందుకోసం విలువలు వదులుకోకూడదని ఇంకా బాగా తెలుసు. ‘విజయా’వారి సినిమా అంటే పిల్లాపాపా తల్లీతండ్రీ కుటుంబ సమేతంగా కలిసి రావాలి. హాయిగా నవ్వుకోవాలి. టికెట్ కొని సినిమా చూసినందుకు మనసు నిండిపోవాలి. చేస్తే గీస్తే ఇలాగే జనరంజకంగా సినిమా చేయాలని నాగిరెడ్డి-చక్రపాణి ఒట్టుపెట్టుకున్నారు. ఆర్టిస్టుల్ని, టెక్నీషియన్లని నెల జీతానికి తీసుకున్నారు.

మొదటి సినిమా ‘షావుకారు’(1950). ఎన్టీఆర్ హీరో. శంకరమంచి జానకి హీరోయిన్. ఎల్వీ ప్రసాద్ డెరైక్టర్. చిన్న చిన్న మనస్పర్థల వల్ల కుటుంబాలు ఎలా చీలిపోతాయన్నది కథ. ఎక్కడా మెలోడ్రామా ఉండదు. అన్నీ రియల్ క్యారెక్టర్లలాగానే అనిపిస్తాయి. ‘భలే తీశార్రా’ అని పేరొచ్చింది. కాసులు మాత్రం రాలలేదు.

నాగిరెడ్డి-చక్రపాణికి జ్ఞానోదయమైంది. జనానికేం కావాలో అర్థమైంది. తమ అమ్ములపొదిలోంచి ‘పాతాళ భైరవి’ అనే అస్త్రం తీసి వదిలారు. ఎక్కడ తగలాలో అక్కడే తగిలింది. ప్రేక్షకులు జిల్ అయిపోయారు. బాక్సాఫీస్ ఘల్‌ఘల్‌మంటూ మోగింది. సినిమా నచ్చితే ఎంతలా కనకవర్షం కురుస్తుందో అందరికీ తెలిసొచ్చింది. ‘పాతాళ భైరవి’లోని ఎన్టీఆర్‌ని చూశాక మాస్ హీరో ఎలా ఉండాలో సినిమా మేకర్లకు అర్థమైంది.

తర్వాత ‘పెళ్లి చేసి చూడు’. ఇదీ హిట్టే! ఇలాక్కూడా ప్రేక్షకుల్ని నవ్విం చొచ్చా అనిపించింది. విజయావారికి బాక్సాఫీస్ గుట్టుమట్లు తెలిసిపోయాయి.

ఆ ఉత్సాహంతోనే రెచ్చిపోయి ‘చంద్రహారం’ తీశారు. పాతిక లక్షల బడ్జెట్. ఆ రోజుల్లో పది సినిమాలు తీసేయొచ్చు. అయినా రిస్క్ చేశారు. కానీ దెబ్బకొట్టింది. అయినా నాగిరెడ్డి కంగారు పడలేదు. కలవరపడలేదు. జీవితంలో పువ్వులే కాదు, రాళ్లూ ముళ్లూ ఉంటాయని తెలుసు. ఈసారి ‘మిస్సమ్మ’ను పంపించారు. వాళ్ల అంచనా మిస్సు కాలేదు.
ఆ తర్వాత ‘మాయాబజార్’. నిజంగానే మాయచేసి పారేసింది. ఆ మాయ గురించి చెప్పాలంటే ఓ ఉద్గ్రంధమే రాయాలి. మారుమాట లేదు.

‘మాయాబజార్’ నాగిరెడ్డినే కాదు, తెలుగు సినిమానే ఎక్కడో కూర్చోబెట్టింది. ఇప్పటికీ తెలుగు సినిమా అంటే ‘మాయాబజారే’!
ఆ తర్వాత ‘అప్పు చేసి పప్పు కూడు’, ‘జగదేకవీరుని కథ’, ‘గుండమ్మ కథ’... అన్నీ సూపర్‌హిట్లే!
తమిళం, కన్నడం, హిందీ... ఏదీ వదిలిపెట్టలేదు. ఎక్కడ తీసినా, ఏం తీసినా ‘విజయ విహారమే’! ఆ రోజుల్లో విజయా సంస్థలో అవకాశం రావడమంటే గవర్నమెంట్ ఉద్యోగం దొరికినంత గొప్ప. ఎన్టీఆర్, ఎస్వీఆర్, సావిత్రి, రేలంగి, పద్మనాభం లాంటి ఎందరో తారలు నెల జీతం మీద ఆ సంస్థలో పనిచేసి పెకైదిగినవాళ్లే!
మార్కస్ బార్‌ట్లే, పింగళి, ఘంటసాల, గోఖలే, కళాధర్, డి.వి.నరసరాజులాంటి హేమాహేమీలంతా ఈ ‘విజయ’ పునాదులతోనే సినీవిశ్వ విఖ్యాతి గాంచారు.

విజయావారి తొలి సినిమా నుంచి ప్రతి సినిమాలోనూ నటిస్తూ వచ్చిన ఎన్టీఆర్, ‘గంగ-మంగ’లో తనకు వేషం ఇవ్వకపోయేసరికి సన్నిహితుల దగ్గర తెగ బాధపడిపోయారు.

‘భైరవ ద్వీపం’ ఓపెనింగ్‌కి వచ్చిన ఎన్టీఆర్ విజయా స్టూడియో అంతా ఆనందంగా తిరుగాడుతూ, ‘‘రెడ్డిగారూ! మీరు స్వయంగా నిర్మిస్తానంటే, నేను హీరోగా నటిస్తాను’’ అన్నారంటే, ఆయనకు నాగిరెడ్డి అంటే ఎంత ఇష్టమో, గౌరవ భావమో అర్థమవుతుంది.

నాగిరెడ్డి నిర్మాతగా సూపర్‌హిట్. మరి డెరైక్టర్‌గా?

ఆయన తీసింది ఒకే ఒక్క సినిమా. అది కూడా తమిళంలో. ‘షావుకారు’కు రీమేక్. పేరు ‘ఎంగవీట్టు పెణ్’. నిర్మల అనే కొత్తమ్మాయి కథానాయిక. తొలిరోజు షూటింగ్. ఎస్వీఆర్, ఎం.ఆర్.రాధ, రెండు సింహాలు. ఇటేమో చిట్టెలుకలా నిర్మల.

‘‘ఈ అమ్మాయి వీక్‌గా ఉంది. కె.ఆర్.విజయను పెట్టుకోండి’’ అని హూంకరించారు ఎస్వీఆర్.
‘పేకప్’ అని అరిచారు నాగిరెడ్డి. నిర్మలకు తన పని అవుట్ అని అర్థమై, రాత్రంతా ఒకటే ఏడుపు. కానీ తెల్లారే కారొచ్చింది. లొకేషన్‌లో చూస్తే ఎస్వీఆర్ లేరు. ఆ ప్లేస్‌లో ఎస్వీ సుబ్బయ్య ఉన్నాడు. డెరైక్టర్ అంటే అదీ. నాగిరెడ్డా మజాకానా!

నాగిరెడ్డి అప్పటికే టాప్ ప్రొడ్యూసర్. డెరైక్షన్ చేసేంత ఖాళీ ఉందా? ఎందుకుండదు. లైటింగ్ దగ్గర్నుంచీ, కెమెరా యాంగిల్ వరకూ అన్నీ తనే చూడాలి. చెప్పాలి. డైలాగులో ఏమాత్రం తేడా వచ్చినా వందసార్లు రిహార్సల్ చేయించేవారు. కాస్ట్యూమ్స్ సరిగ్గా కుదరకపోతే కయ్యిమనేవారు.
సినిమా బాగా వచ్చింది. నాగిరెడ్డి డెరైక్షన్‌కూ పేరొచ్చింది. నిర్మల... విజయ నిర్మలగా మారింది.

నాగిరెడ్డిలో ఒక్క సినిమా యాంగిలే కాదు... ఇంకా చాలా యాంగిల్స్ ఉన్నాయి. ఆయనో గొప్ప పబ్లిషర్, ప్రింటర్. స్వాతంత్య్రోద్యమ సమయంలోనే ఆగిపోయిన ‘ఆంధ్రజ్యోతి’ వారపత్రికను బి.ఎన్.గుప్తా నుంచి తీసుకుని, మాసపత్రికగా కొన్నాళ్లు నడిపారు. శ్రీశ్రీ, చలం, కొడవటిగంటి లాంటి హేమాహేమీలతో రచనలు చేయించారు.

1947 జూలైలో తెలుగు, తమిళాల్లో ‘చందమామ’ప్రారంభించారు. పేరుకే పిల్లల పత్రిక. కానీ పెద్దలకూ ప్రియమైన పత్రిక అయిపోయింది. 13 భాషల్లో ఈ పత్రిక వెలువడటం ఓ రికార్డ్. అంధుల కోసం ప్రత్యేకంగా బ్రెయిలీ లిపిలోనూ ‘చందమామ’ను అందించారు. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌లాంటివాళ్లు నాగిరెడ్డిని ‘చందమామ’రెడ్డి అని పిలిచేవారు. అసలు ‘చందమామ’ అనేది లేకపోతే మనకింత బాల సాహిత్యం దక్కేదా అనిపిస్తుంది.

1966లో స్థాపించిన ‘విజయ చిత్ర’ సినిమా పత్రికదీ ఓ సంచలన పర్వమే. మూడు దశాబ్దాలకు పైగా నిర్విరామంగా వెలువడిన ఈ పత్రికకు ఇప్పటికీ వీరాభిమానులున్నారు. అలాగే నాగిరెడ్డి స్త్రీల కోసం ‘వనితను, యువత కోసం ‘యువ’ను నిర్వహించారు.

ఇక బి.ఎన్.కె. ప్రెస్‌ని ఆయన అభివృద్ధి చేసిన తీరు మరో చరిత్ర! ఆసియాలోనే అతి గొప్ప ప్రెస్‌గా దాన్ని తీర్చిదిద్దారు. ఇండియాలోని సినిమా పోస్టర్లన్నీ దాదాపుగా అక్కడే ప్రింటయ్యేవి. అతిపెద్ద సినిమా పోస్టర్‌గా రికార్డ్ సృష్టించిన ‘కాగజ్ కే పూల్’ ఇక్కడే ముద్రితమైంది.

నాగిరెడ్డి జీవితంలో కీలకమైన అధ్యాయం - విజయ వాహినీ స్టూడియో నిర్వహణ. మూలా నారాయణస్వామి నుంచి వాహినీ స్టూడియో చేపట్టి, దాన్నే 14 ఫ్లోర్లతో ఆగ్నేయాసియాలోనే అతి పెద్దదైన ‘విజయ-వాహినీ స్టూడియోస్’గా విస్తరింపజేయడంలో నాగిరెడ్డి కార్యదీక్ష కనిపిస్తుంది. రకరకాల భాషల సినిమాల షూటింగులతో అప్పట్లో ఆ స్టూడియో స్వర్గాన్ని తలపింపజేసేది. ఎప్పటికప్పుడు మార్పులూ చేర్పులూ చేపడుతూ కొత్త హంగులు అద్దేవారు.

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా ఆయన చేసిన సేవల్ని ఇప్పటికీ భక్తులు గుర్తుంచుకుంటారు. ఇవాళ భక్తులు అనుభవిస్తున్న అనేక సౌకర్యాలు ఆయన ఊహల్లో రూపుదాల్చినవే!

నాగిరెడ్డికి చిత్ర నిర్మాణమే కాదు, భనవ నిర్మాణమన్నా చాలా ఇష్టం. విజయా హాస్పిటల్స్, విజయా శేష్‌మహల్ కళ్యాణమంటపం ఆయన ఆధ్వర్యంలో తయారైనవే. అక్కినేని నాగేశ్వరరావు అరవై సినిమాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఫంక్షన్ చేసుకుంటానంటే ఆగమేఘాల మీద ‘విజయా గార్డెన్స్’ సిద్ధం చేయించారు. ప్రపంచంలో అత్యధిక షూటింగులు జరుపుకున్న ప్రదేశం ఇదేనంటారు దర్శకుడు సింగీతం.
90 ఏళ్లు వచ్చేవరకూ కూడా ఒక గొడుగు పట్టుకుని మెల్లగా నడుస్తూ ఆ కట్టడాల్ని పరిశీలిస్తుండేవారు.

‘క్రియా సిద్ధిఃస్సత్త్వే భవతి మహతాంనోపకరణే’ అని భర్తృహరి సుభాషితం. మహాత్ములైనవారికి వారి సామర్ధ్యం వల్లనే పనులు సిద్ధిస్తాయి. నాగిరెడ్డి కూడా తన సామర్ధ్యంతోనే వ్యక్తి నుంచి వ్యవస్థ స్థాయికి ఎదిగారు. ‘విజయ’ సామ్రాజ్యాన్ని నిర్మించారు.

-పులగం చిన్నారాయణ


ప్రొఫైల్
జన్మదినం : 1912 డిసెంబర్ 2
స్వస్థలం : పొట్టిపాడు (కడప)
తల్లిదండ్రులు : ఎరుకలమ్మ, బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి
సోదరులు : బి.ఎన్.రెడ్డి (అన్నయ్య), కొండారెడ్డి, రామలింగారెడ్డి (తమ్ముళ్లు)
సంతానం : నలుగురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు, బి.ఎల్.ఎన్.ప్రసాద్, జయలక్ష్మి, వేణుగోపాల్‌రెడ్డి, విశ్వనాథరెడ్డి, శారద, వెంకట్రామిరెడ్డి
పురస్కారాలు:దాదా సాహెబ్ ఫాల్కే (86), రఘుపతి వెంకయ్య (87)
మరణం : 2004 ఫిబ్రవరి 25

నాగిరెడ్డి ‘విజయ’ చిత్రాలు
తెలుగు
షావుకారు (1950)
పాతాళభైరవి (1951)
పెళ్లిచేసి చూడు (1952)
చంద్రహారం (1954)
మిస్సమ్మ (1955)
మాయాబజార్ (1957)
అప్పుచేసి పప్పుకూడు (1959)
జగదేక వీరునికథ (1961)
గుండమ్మ కథ (1962)
సత్యహరిశ్చంద్ర (1965)
సి.ఐ.డి. (1965)
ఉమాచండీగౌరీ శంకరుల కథ (1968)
గంగ-మంగ (1974)
శ్రీరాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్ (1976)

తమిళంలో...

పాతాళభైరవి, కల్యాణం పణ్ణిపార్, చంద్రహారం, మిస్సియమ్మ, గుణసుందరి, మాయాబజార్, కడన్‌వాంగి కల్యాణం, మనిదన్ మారవిల్లై, ఎంగవీట్టు పిళ్ళై, ఎంగవీట్టు పెణ్, నమ్‌నాడు, వాణి-రాణి, మీన్డుమ్ సావిత్రి;

కన్నడంలో...

మాయాబజార్, జగదేకవీరన కథే, సత్యహరిశ్చంద్ర, మదువే మాడినోడు;

హిందీలో...

మాయాబజార్, రామ్ ఔర్ శ్యామ్, నన్హా ఫరిస్తా, ఘర్‌ఘర్‌కీ కహానీ, జూలీ, యహి హై జిందగి, స్వర్గ్-నరక్, స్వయంవర్, శ్రీమాన్ శ్రీమతి.


‘కాలం మారింది మనుషులే మారాలి’

నాగిరెడ్డికి బంగారమన్నా, ఆడంబరాలన్నా చిరాకు. ఇంట్లో ఎవ్వరికీ బంగారం కొనేవారు కాదు.
వాహినీ స్టూడియో వైశాల్యం 10 ఎకరాలు. తర్వాత పక్కనున్న రేవతి స్టూడియో, ఇతర స్థలాలు కలిపి మరో 12 ఎకరాలు కొన్నారు. మొత్తం విజయ-వాహినీ వైశాల్యం 22 ఎకరాలు.

నాగిరెడ్డి మద్రాసు దాటి వెళ్లడానికి ఇష్టపడేవారు కాదు. హైదరాబాదులో స్టూడియోకి ఆయన కనుక స్థలం కావాలనుకుని ఉంటే వెంటనే ఇచ్చేసేవారు. అంతెందుకు ‘చందమామ’ ప్రెస్ కోసం తనయుడు విశ్వనాథరెడ్డికి బంజారాహిల్స్ రోడ్ నం.12లో 5 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయిస్తే, నాగిరెడ్డి అడ్డుకున్నారు. అంతా ఒకేచోట ఉండాలనేది ఆయన సిద్ధాంతం.

తిండి విషయంలో పెద్దగా ఆసక్తి ఉండేది కాదు కానీ రాయలసీమ రాగి సంగటిని ఇష్టపడేవారు.
కమ్మ-రెడ్డి వైషమ్యాలు చూపించి నాగిరెడ్డి-చక్రపాణిని విడగొట్టాలని చాలామంది ప్రయత్నించి విఫలమ య్యారు. ఈ విషయమై డి.వి.నరసరాజుతో ఓ కథ తయారుచేయించి తెలుగులో చేయాలనుకున్నారు. చక్రపాణి మరణంతో ఆగిపోయింది. ‘కాలం మారింది మనుషులే మారాలి’ పేరుతో అది ‘విజయచిత్ర’లో సీరియల్‌గా ప్రచురితమైంది కూడా.

రూపాయి లేకుండా హక్కులిచ్చిన రజినీకాంత్

1990లలో రజనీకాంత్ నిర్మించిన ‘వల్లి’ చూసి నాగిరెడ్డి చలించిపోయారు. రజనీకాంత్ ఇంటికి వెళ్లి మరీ హక్కులు అడిగారు. పెద్దాయన మీద ప్రేమతో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా రజనీ హక్కులు ఇచ్చేశారు. దాన్నే నాగిరెడ్డి ‘విజయ’ పేరుతో తెలుగులోకి అనువదించారు. ఆ వచ్చిన లాభాలతో ‘విజయా హెల్త్ సెంటర్’లో ఓ బ్లాక్ నిర్మించి, రజనీకాంత్‌తో ప్రారంభింపజేశారు.

నాయన మా వెన్నంటే ఉన్నట్టుంది: బి.విశ్వనాథరెడ్డి

‘‘మేం ఏ పని తలపెట్టినా మా నాయన మా వెన్నంటే ఉన్నట్టు అనిపిస్తుంది. నాయన తరహాలోనే కథను నమ్మి, విలువలను నమ్మి సినిమాలు నిర్మించాలని మాకూ ఉంది. కానీ ఇప్పటి నిర్మాణ శైలిని చూస్తే భయమేస్తోంది. మూడేళ్ల క్రితం ఓ గుజరాతీ రచయిత దగ్గర మంచి కథ కొన్నా. ‘విజయ’ పద్ధతుల్లో ఉండే కథ ఇది. ఎప్పుడు చేసినా మా సంస్థ పేరు చెడిపోకుండా జాగ్రత్తపడతాను.’’

నిర్మాత, స్టూడియో అధినేత, పబ్లిషర్, ప్రింటర్ బి.నాగిరెడ్డి శతజయంతి నేడు (2.12.2012)