Friday, May 3, 2013

గిన్నిస్‌బుక్‌లోకి "అగడం"

ఒక్క షాట్‌లో రూపొందిన అధిక నిడివి గల చిత్రంగా అగడం గిన్నిస్‌బుక్‌లో స్థానం సంపాదించింది. పూర్తిగా నూతన నటీనటులతో తెరకెక్కిన ఈ చిత్ర షూటింగ్ గత ఏడాది డిసెంబర్ 7న గిన్నిస్‌బుక్‌లో నమోదైంది. రెండు గంటల మూడు నిమిషాలు 30 సెకన్లలో చిత్రీకరణ జరుపుకుంది. షూటింగ్ ఒక నోటరి, పబ్లిక్ న్యాయవాది, అధ్యాపకులు, ఎత్తన్ చిత్ర దర్శకుడు సురేష్ సమక్షంలో జరిగింది.

చిత్రీకరించిన సన్నివేశాలన్నింటినీ వెంటనే లండన్‌లోని గిన్నీస్‌బుక్ రికార్డు సమితికి దర్శకుడు మొహ్మద్ ఇసాక్ పంపారు. లాస్ట్ బెంచ్ బాయ్స్ ప్రొడక్షన్ పతాకంపై ఎం.రసియతి మహమ్మద్, మొహ్మద్ ఇసాక్ నిర్మించిన ఈ చిత్రానికి కెమెరామెన్ నౌషద్. చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం ఉదయం చెన్నైలోని ఆర్‌కేవీ స్టూడియోలో జరిగింది.

చిత్ర ట్రైలర్‌ను అభిరామి రామనాథన్ ఆవిష్కరించారు. తొలి సీడీని కె.భాగ్యరాజ్ అందుకున్నారు. ఈ సందర్భంగా అభిరామి రామనాథన్ మాట్లాడుతూ ఒక్క భారతీయుడి మేధస్సు, పదిమంది అమెరికన్ల మేధస్సుకు సమానమని తానెప్పుడూ చెబుతుంటానన్నారు. అది ఈ చిత్రంతో మరోసారి నిజమైందని పేర్కొన్నారు.

No comments:

Post a Comment